Advertisement
Google Ads BL

ఆ నాలుగింటిపైనే రాశీఖన్నా ఆశలు.. నెరవేరేనా!?


రాశీఖన్నా.. తెలుగుతెరకు పరిచయమైన అందాల భామల్లో ఒకరు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాత మొదట మంచి అవకాశాలు వచ్చాయి.. నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఏమైందో ఏమోగానీ అలా వరుస సినిమాలు నటిస్తున్న నేపథ్యంలో కాస్త వెనకడుగేసింది. అంటే నిదానమే ప్రధానం అనుకుందేమో కానీ చాలా వరకు సినిమాలు చేయిజార్చుకుంది. అలా బోలెడెన్ని సినిమాలను వదులుకుంది. దీంతో ఈమెకంటే వెనుక వచ్చిన నటీమణులంతా ఆ అవకాశాలను ఎగరేసుకుని వెళ్లారు. ఇలా చేయడంతో ఎక్కడో ఉండాల్సిన రాశీఖన్నా.. ఎంతో కింద కిందపడిపోయింది.

Advertisement
CJ Advs

జరగాల్సిందంతా జరిగిపోయాక నిద్ర మేల్కోన్న ఈ ముద్దుగుమ్మ ఇకనుంచి తన దగ్గరికి వచ్చిన ప్రతి సినిమాలో చేసి తీరాల్సిందేనని ఫిక్సయిపోయి.. టాలీవుడ్, కోలీవుడ్‌లో నటించాలని నిర్ణయించింది. అలా అనుకున్న కొద్దిరోజుల్లోనే తెలుగులో తేజు సరసన నాయికగా ‘ప్రతిరోజూ పండగే’.. విజయ్ దేవరకొండ జోడీగా ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాలు చేస్తోంది. అంతేకాదు మరో రెండు తమిళ సినిమాల్లోనూ నటిస్తోంది. విజయ్ సేతుపతి సరసన ‘తంగా తమిజన్’లో నటించింది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. మరోవైపు.. ‘సైతాన్ కా బచ్చా’ను పూర్తి చేసే పనిలో బిజీబిజీగా ఉంది.

చాలా రోజుల తర్వాత వరుస సినిమాలు రావడంతో ఈ భామ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. వాస్తవానికి ఈ నాలుగు సినిమాలు తన క్రేజ్ పెంచుతాయని.. మళ్లీ పాత ఫేమ్ వస్తుందని రాశీఖన్నా భావిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ నాలుగు సినిమాలపైనే ప్రస్తుతం రాశీఖన్నా ఆశలన్నీ పెట్టుకుంది. ఈ సినిమాలు ఏ మాత్రం రాశీకి హిట్ తెచ్చిపెడతాయో..? ఆమె పెట్టుకున్న ఆశలు ఏ మాత్రం నెరవేరుతాయో తెలియాలంటే నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యేంత వరకూ వేచి చూడాల్సిందే మరి.

Rashi khanna Pins Hopes On Four Movies.. !!:

Rashi khanna Pins Hopes On Four Movies.. !!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs