Advertisement
Google Ads BL

‘వాల్మీకి’లో హీరో కంటే ఈయనే ఎక్కువటగా!


మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘గద్దలకొండ గణేష్’ అలియాస్ ‘వాల్మీకి’. ఇటీవల రిలీజ్ అయిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్‌ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాను మెగా హీరోలతో పాటు పలువురు దర్శకులు, ప్రముఖులు మెచ్చుకున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ మొదలైన రోజు నుంచి రిలీజ్ అయ్యే ముందు రోజు రాత్రి వరకూ అన్నీ వివాదాలే. టైటిల్ మార్చడంతో ఆ ఎఫెక్ట్‌ సినిమాపై పడుతుందని అందరూ అనుకున్నారు కానీ.. ఊహించిన దానికంటే సక్సెస్‌ అయ్యింది.

Advertisement
CJ Advs

అయితే ఈ సినిమా చూసిన అందరూ హీరో కంటే కమెడియన్ రచ్చరవి పేరునే ఎక్కువగా చెబుతుండటం గమనార్హం. అంతేకాదు ఇదే విషయాన్ని సీనియర్ నటుడు, మా అధ్యక్షుడు నరేశ్ ఫేస్‌బుక్‌లో ఓ సెల్ఫీ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోలో రచ్చరచ్చ రవిపై ప్రశంసలు వర్షం కురిపిస్తూ.. రచ్చ రచ్చేనంటూ అభినందించారు. ‘సినిమాకు సంబంధించిన ప్రతి రివ్యూలో ఎక్కడా చూసిన నీ పేరే వినిపిస్తోంది. నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉంది రవి. రచ్చరవి మంచి నటుడితో పాటు... మంచి మనిషి. రవికి ఇలాంటి ఎప్పటికైనా ఇలాంటి క్యారెక్టర్ పడాలని దేవుడ్ని ప్రార్థించాను. ఇన్నాళ్లకు ‘వాల్మీకి’ సినిమాలో రచ్చరవికి మంచి క్యారెక్టర్ రావడం... ప్రతి రివ్యూలో ఆయనే పేరు వినిపించడం చాలా ఆనందంగా ఉంది. రచ్చ రవి టాలెంట్‌కు గుర్తింపు వచ్చింది. ఈ సినిమా రవి భవిష్యత్తుకు పునాది. మరిన్ని సినిమా అవకాశాలు నీకు రావాలి సోదరా’ అంటూ నరేష్ వీడియోలో చెప్పుకొచ్చాడు.

ఇందుకు స్పందించిన రవి.. ‘నా మీద మీరు చూపించిన ప్రేమకి మీ ఆశీర్వాదాలకు నేను ఎప్పటికీ కృతజ్ఞుడను అన్నయ్యా..’ అంటూ రిప్లై ఇచ్చాడు. కాగా.. వాల్మీకి సినిమాలో రవి.. ‘తుపాకి రాజు’ అనే పాత్రలో నటించి మెప్పించాడు.  అనే క్యారెక్టర్ క్రియేట్ చేసిన డైరెక్టర్ హరీష్ శంకర్ అన్నకు ఈ అవకాశం కల్పించిన 14 Reals plus బ్యానర్ కు పేరుపేరునా నా కృతజ్ఞతలు అంటూ ఫేస్ బుక్‌లో పోస్టు పెట్టాడు. మీ ప్రోత్సాహం మీ ఆశీర్వాదం ఎల్లప్పుడూ కోరుకుంటూ నేను రచ్చ రవి ఎప్పటికి మీ గుండెలో అంటూ రచ్చరవి తెలిపాడు.

News About Valmiki Movie:

News About Valmiki Movie  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs