వేణుమాధవ్ భౌతికంగా లేరనే వార్త నన్ను ఎంతగానో బాధపెట్టింది. తెలుగు సినిమా వినోదాన్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్లి హాస్యనటుడిగా శిఖరాగ్రస్థాయికి చేరుకున్నారు. ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని పొందారు. వేణుమాధవ్ నా సినిమాలన్నింటిలో నటించాడు. మా ఇద్దరిది ఒకే జిల్లా. ఎంతో ఆత్మీయంగా ఉండేవాడు. అద్భుతమైన హాస్యనటుడిగా వెలుగొందిన వేణుమాధవ్ మరణం సినీ పరిశ్రమకు, మిత్రులకు, నాలాంటి సన్నిహితులకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
ఎన్.శంకర్, ప్రముఖ దర్శకుడు, తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షుడు