Advertisement
Google Ads BL

ఇది తెలియకపోతే ఎలా సోనాక్షి.. డబ్బు పశువు!


సినిమాల్లో నటించే నటీనటులు.. రీల్ లైఫ్‌లోనే హీరోలు.. రియల్‌ లైఫ్‌లో మాత్రం జీరో అని తాజా జరిగిన ఓ ఘటనతో నిరూపితమైంది. ఇదిగో ఈ పక్క ఫొటోలో ఉండే నటీమణిని గుర్తు పట్టారా.. అదేనండి బాలీవుడ్ ప్రముఖ నటి సోనాక్షి సిన్హా. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న కౌన్ బనేగా కరోడ్‌పతి సిజన్- 11 షోకి ఇటీవల సెలబ్రిటీ కోటాలో సోనాక్షి వచ్చింది. ఆమె కో-పార్టిసిపెంట్‌గా ప్రముఖ సామాజికవేత్త రూమా దేవి విచ్చేశారు. ఈ సందర్భంగా రామాయణానికి సంబంధించి రూ.12,50,000 గెలుచుకునేందుకు ప్రశ్న అడగ్గా సోనాక్షి నోరెళ్లబెట్టింది.

Advertisement
CJ Advs

‘హనుమంతుడు ఎవరి కోసం సంజీవని తెచ్చాడు?’ అని అమితాబ్ ప్రశ్నించి.. దానికి ఆప్షన్స్‌గా ఎ) సుగ్రీవుడు, బి) లక్ష్మణుడు సి) సీత, డి) రాముడు అని ఇచ్చారు. ఈ ప్రశ్నకు సోనాక్షి మాత్రం సమాధానం చెప్పలేక లైఫ్‌లైన్‌ను ఉపయోగించుకుంది. వాస్తవానికి రామాయణం గురించి కాస్త కూస్తో తెలిసిన వాళ్లకు టక్కున గుర్తొచ్చేది ‘లక్ష్మణుడు’ అనే సమాధానమే. కానీ సోనాక్షికి మాత్రం ఈ ముక్క తెలియకపోవడం గమనార్హం. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పకపోవడంతో ఆమెకు.. జీవితాంతం గుర్తుండిపోయే రేంజ్‌లో నెటిజన్లు ట్రోల్స్ చేస్తారు.

కాగా.. ఎందుకంటే సోనాక్షి తండ్రి శత్రుఘ్న సిన్హా  తన ఇంటికి రామాయణ అని పేరు పెట్టుకున్నారు. అంతేకాదు తన ఇద్దరు కుమారులకు సీతారాముల కుమారులైన లవకుశల పేర్లు పెట్టుకున్నారు. రాముడిని అంతగా కొలిచేవారి కుటుంబం నుంచి వచ్చిన సోనాక్షి రామాయణానికి సంబంధించిన ఈ చిన్న ప్రశ్నకు సమాధానం చెప్పకపోవడం గమనార్హం.

అంతేకాదు.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సునీల్ భరాలా అనే మంత్రి స్పందిస్తూ..‘సోనాక్షి ఓ డబ్బు పశువు.. ఇలాంటి వాళ్లు డబ్బు కోసమే ఆలోచిస్తారు కానీ మంచి విషయాలు నేర్చుకోవడానికి అసలు శ్రద్ధ చూపరు. ఈ కాలంలో ఇలాంటి నటీనటులు కేవలం డబ్బు కోసమే బతుకుతున్నారని.. డబ్బు ఎలా సంపాదించాలి..? ఎలా ఖర్చు పెట్టాలనే తప్ప..చరిత్ర గురించి కానీ దేవుళ్ల గురించి కానీ అసలు నేర్చుకోవడం లేదు. ఇంతకంటే బాధాకరమైన విషయం మరొకటి ఉండదు’ అని ఆమెపై విరుచుకుపడ్డారు. 

UP Minister slams Sonakshi Sinha for KBC gaffe:

UP Minister slams Sonakshi Sinha for KBC gaffe
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs