Advertisement
Google Ads BL

ఇక్కడ జగ్గుభాయ్.. అక్కడేమో సుమన్ భాయ్!


ఒకప్పుడు టాలీవుడ్, కోలీవుడ్‌లో ఓ ఊపు ఊపిన సుమన్.. ఇప్పుడు ఆయన్ను భూతద్దం పెట్టి వెతికినా ఎక్కడా కనిపించట్లేదు. అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణలకు సైతం గట్టి పోటీ ఇస్తూ సినిమాలు చేసే సుమన్.. ప్రస్తుతం విలన్ పాత్రలతో సరిపెట్టుకుంటున్నారు. అయితే ఈయన టాలీవుడ్‌ సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంటూ కోలీవుడ్‌కు మాత్రమే పరిమితమయ్యారు. అసలెందుకు మీరు తెలుగులో చేయట్లేదు అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన్ను అడగ్గా ఆసక్తికర సమాధానం చెప్పారు.

Advertisement
CJ Advs

‘తమిళంలో రజనీకాంత్ నటించిన శివాజీ సినిమాలో నేను విలన్‌గా చేశాను. ఆ సినిమాలో నా పాత్రకు ఊహించని రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత తమిళంలో అదే తరహా పాత్రలు వరుసగా వచ్చాయి. స్టార్ హీరోలైన విజయ్, అజిత్, ధనుశ్ చిత్రాలలో విలన్‌గా చేశాను. అలా అదే ఊపును కంటిన్యూ చేస్తున్నాను. అయితే శివాజీ తర్వాత తెలుగులో కూడా నాకు అవకాశాలు వచ్చాయి, కానీ.. తమిళంలో బిజీబిజీగా ఉండటంతో ఇక్కడికి రాలేకపోయాను. అంతేకాదు.. ‘శివాజీ’లో విలన్ పాత్ర స్థాయికి తగిన పాత్రలు రాకపోవడం వలన చేయలేకపోయాను’ అని సుమన్ చెప్పుకొచ్చారు.

అంటే టాలీవుడ్‌లో జగ్గూభాయ్ (జగపతి బాబు) హీరో టూ విలన్‌గా ఎలా మారిపోయారో.. సుమన్ కూడా సేమ్ టూ సేమ్ మారిపోయారన్న మాట. తెలుగులో జగపతి మంచి పాత్రల్లో నటిస్తూ జీవితాన్ని సాగిస్తున్నారు. మొత్తానికి చూస్తే టాలీవుడ్‌ను జగ్గూభాయ్.. కోలీవుడ్‌ను సుమన్‌భాయ్ ఏలేస్తున్నారన్న మాట. ఇంతటితో హీరో రోల్‌కు పూర్తిగా ఫుల్‌స్టాప్ పెట్టేసి విలన్‌గా కంటిన్యూ చేస్తూ ముందుకెళ్తున్నారన్న మాట. ఏదైతే నేం కళామాతల్లి ఒడిలో ఉంటే చాలు మరి.

Jaggu Bhai- Tollywood.. Sumban Bhai...! :

Jaggu Bhai- Tollywood.. Sumban Bhai...!   
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs