Advertisement
Google Ads BL

‘సీత’ పాత్రకోసం శ్రద్ధా అన్ని కోట్లు అడిగిందా!


టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ భారీ బడ్జెట్‌తో ‘రామాయణం’ నిర్మించబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని నితేష్‌ తివారీ (దంగల్‌ ఫేం), రవి ఉద్యవర్‌ (మామ్‌ ఫేం) తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో ఎవరెవర్ని తీసుకోవాలి..? అని పాత్రదారులను వెతికే పనిలో దర్శకనిర్మాతలు బిజిబిజీగా ఉన్నారు. ముఖ్యంగా రాముడు, రావడుణు పాత్రలో ఎవరెవర్ని తీసుకోవాలనే దానిపై ప్రస్తుతం నిర్మాతలు యోచిస్తున్నారు. అయితే.. తాజాగా ఇందుకు ఓ వార్త వైరల్‌గా మారింది.

Advertisement
CJ Advs

అల్లువారి రామాయణంకు రాముడు, శ్రీదేవి, రావణుడు దొరికేశారట. ఈ సినిమాలో శ్రీరాముడిగా హృతిక్ రోషన్‌ నటిస్తుండగా.. సీతాదేవిగా దీపికా పదుకొనేను అనుకున్నారట. కొన్ని అనివార్యకారణాల వల్ల దీపిక కుదరదని చెప్పడంతో దర్శక నిర్మాతలు శ్రద్ధా కపూర్‌ను సంప్రదించగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్. అయితే శ్రద్ధా మాత్రం ఈ పాత్రలో నటించడానికి గట్టిగానే డిమాండ్ చేసిందట. ఐదారు కోట్లు కాదండోయ్ ఏకంగా 11 కోట్లు ఇవ్వమని అడిగిందని సమాచారం. అయినప్పటికీ శ్రద్ధాకు అన్ని కోట్లు ఇవ్వడానికి రెడీ అయ్యారట. అయితే ఈ వార్తలో నిజమెంత ఉందో తెలియాలంటే దర్శకనిర్మాతలు క్లారిటీ ఇవ్వాల్సిందే మరి.

Shraddha Kapoor to play Sita opposite Hrithik Roshan:

Shraddha Kapoor to play Sita opposite Hrithik Roshan  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs