హాట్ అనసూయకు అదిరిపోయే ఆఫర్!!


యాంకర్‌గా తెలుగు ప్రేక్షకులకు అనసూయ భరద్వాజ్ సుపరిచితురాలే. ఓ వైపు బుల్లితెరపై.. మరోవైపు వెండితెరపై తనదైన శైలిలో రాణిస్తోంది. ఇప్పటికే పలు చిత్రాల్లో నటించి మెప్పించిన ఈ హాట్ భామ.. ‘కథనం’ సినిమాతో అభిమానుల ముందుకు సైలెంట్‌గా వెళ్లిపోయింది. అయినప్పటికీ ఈ రంగమ్మత్తకు మాత్రం క్రేజీ ఆఫర్లకు కొదువలేదు.

ఇప్పటికే.. మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివ కాంబోలో వస్తున్న సినిమాలో నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అంతేకాదు..  అల్లుఅర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించబోయే చిత్రంలోనూ అనసూయ అందాలు ఆరబోస్తుందని సమాచారం. ఈ రెండు సినిమాల్లోనూ రంగమ్మత్త కోసం ప్రత్యేకంగా పాత్రలు క్రియేట్ చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మొత్తానికి చూస్తే ఈ రెండు సినిమాల్లో నటించడం క్రేజీనే అని చెప్పుకోవచ్చు.

అయితే.. అల్లు అర్జున్ సినిమాలో మాత్రం అనసూయది ఫుల్ లెంగ్త్ పాత్ర అని తెలుస్తోంది. ‘రంగస్థలం’ సినిమాలో రంగమ్మత్తగా నటించిన అనసూయ.. సుకుమార్‌కు తెగ నచ్చేసిందట. అందుకే తన తదుపరి సినిమాలో కూడా ఈ యాంకరమ్మకు అవకాశం ఇవ్వాలని ఫిక్స్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే షూటింగ్ పట్టాలెక్కేవరకు వేచి చూడాల్సిందే మరి.

Hot Anasuya bharadwaj got chance to act in Allu arjun-sukumar upcoming movie:

Hot Anasuya bharadwaj got chance to act in Allu arjun-sukumar upcoming movie  
Show comments


LATEST TELUGU NEWS


LATEST IN NEWS

POPULAR NEWS



LATEST IN GALLERIES

POPULAR GALLERIES