Advertisement
Google Ads BL

అమితాబ్‌కు ‘దాదా సాహెబ్ ఫాల్కే’ అవార్డు


బాలీవుడ్‌ బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌ను అత్యున్నత పురస్కారమైన ‘దాదా సాహెబ్ ఫాల్కే’ అవార్డు వరించింది. సినీరంగంలో చేసిన విశేష సేవలకు అందించినందుకు గాను అమితాబ్‌ను ఈ అవార్డుకు ఎంపిక చేస్తున్నట్లు కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘రెండు తరాల ప్రేక్షకులను సమ్మోహితులను చేసి, వారికి స్ఫూర్తిగా నిలిచారు. అమితాబ్‌ను చూసి యావత్ దేశంతో పాటు అంతర్జాతీయ సమాజం కూడా గర్విస్తోంది. యావత్ భారతావనికే కాకుండా అంతర్జాతీయ సమాజం కూడా సంతోషపడే విషయమిది’ అని చెప్పిన ఆయన.. ఈ సందర్భంగా బిగ్‌బీకి హృదయపూర్వక శుభాభినందనలు తెలిపారు.

Advertisement
CJ Advs

అమితాబ్‌ను ఈ అత్యున్నత పురస్కారం వరించినట్లు తెలుసుకున్న సినీ రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా వెల్లువలా అభినందనలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా బిగ్‌బీ కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఇదిలా ఉంటే.. 76 ఏళ్ల అమితాబ్.. ఒకట్రెండు కాదు ఐదు దశాబ్దాల పాటు ఒక్క బాలీవుడ్‌లోనే కాకుండా అన్ని భాషల్లో నటించి మెప్పించారు. కాగా.. మెగాస్టార్ చిరు ప్రతిష్టాత్మంగా తీసుకుని నటించిన ‘సైరా’లో గురువుగా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అక్టోబర్-02న సైరా థియేటర్లలోకి రానుంది.

Amitabh Bachchan To Receive This Year’s Dadasaheb Phalke Award:

Amitabh Bachchan To Receive This Year’s Dadasaheb Phalke Award  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs