మెగాస్టార్ చిరంజీవి అంటే మన తెలుగు రాష్ట్రాల్లో అందరి ఫ్యాన్స్‌కి దాదాపు ఇష్టమే. ఎందుకంటే ఆయన చేయని సినిమా లేదు. ఎటువంటి సినిమా అయినా చాలా అవలీలగా చేసే మెగాస్టార్ స్టామినా ఏంటో ఆయన క్రేజ్ ఏంటో అతని రీఎంట్రీ సినిమాతోనే చూసాం. ఇప్పుడు వస్తున్న సైరా ఓపెనింగ్స్ విషయంలో ఎటువంటి డోకా లేదు. సినిమాకి హిట్ అనే టాక్ వస్తే నాన్ బాహుబలి పై ఉన్న అన్ని రికార్డ్స్‌ని బ్రేక్ చేస్తాడు చిరు. అయితే ఈ లెక్కలు మన తెలుగు స్టేట్స్ వరకే.
బయట రాష్ట్రాలకి వెళ్తే లెక్కలు మారిపోతాయి. మనకి చిరు పెద్ద స్టార్ కావొచ్చు కానీ ఇతర భాషల్లో కాదు. ఇప్పుడు ఆయన వయసు అరవైల్లో ఉంది. చిరును బయట భాషలు వాళ్ళు ఆయనను ఒక ఎజ్డ్ స్టార్ కిందే చూస్తారు. చిరు దేశవ్యాప్తంగా అందరికీ తెలుసు కానీ ఆయన సినిమాను ఎగబడి చూసే క్రేజ్ మాత్రం ఉండదు. మహా అయితే కర్ణాటకలో ఆయన ఫాలోయింగ్ ఉండొచ్చు కానీ ఇతర రాష్ట్రాల్లో లేదు.
ఇక సైరా సినిమాను ‘సాహో’ తరహాలో ప్రమోషన్స్ చేస్తున్నారు కానీ ఆ సినిమాకు ఈ సినిమాకు చాలా తేడా ఉంది. ఎందుకంటే ప్రభాస్ బాహుబలితో ఇండియా మొత్తం తెలిసేలా చేసుకున్నాడు. అందుకే సాహో చిత్రం కూడా హిందీలో మంచి క్రేజ్ దక్కించుకుని అక్కడ బాగా సక్సెస్ అయింది. సైరా విషయం తీసుకుంటే చిరుకు దేశవ్యాప్తంగా క్రేజ్ లేదు.. పైగా వయసు ఆయనకు పెద్ద మైనస్. మరి చిరు ఇన్ని ఇబ్బందులను అధిగమించి ‘సైరా’తో పాన్ ఇండియా స్టార్‌గా మారతారా? లేదా? అనేది తెలియాలంటే అక్టోబర్ 2 వరకు ఆగాల్సిందే.