Advertisement
Google Ads BL

చిరు.. ‘సైరా’ రిలీజ్‌ను ఆపేస్తాం!!


మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్మాత్మకంగా భావించి నటించిన ‘సైరా’ సినిమాను వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. సినిమా షూటింగ్ మొదలుకుని త్వరలో రిలీజ్ కానున్నప్పటికీ వివాదాలకు ఫు‌ల్‌స్టాప్ అవకాశాలు మాత్రం కనిపించట్లేదు. వాస్తవానికి ఇలాంటి వివాదాలకు ఆదిలోనే తేల్చేయాల్సిన మెగాస్టార్ చిరు, రామ్ చరణ్ కూడా ఇంటి దాకా తెచ్చుకున్నారు. సినిమా కథ అనుకుంటున్నప్పుడు సైరా వారసులకు ఫలానా మొత్తంలో డబ్బులు చెల్లిస్తామని దర్శకనిర్మాతలు హామీ ఇచ్చారు. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో కానీ మనసు మార్చుకున్నారు. దీంతో ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. 

Advertisement
CJ Advs

సినిమా రిలీజ్‌ను ఆపేస్తామంటూ సైరా నర్సింహారెడ్డి వారసులు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు. కథ వాడుకున్నందుకు గాను ఇచ్చిన మాట ప్రకారం తమకు డబ్బులు చెల్లించాలని వారసులు.. ఇచ్చే ప్రసక్తే లేదని మెగా ఫ్యామిలీ ఇలా అస్తమాను సైరా నెగిటివ్‌గానే వార్తల్లో నిలుస్తోంది. అయితే తాజాగా మరో అడుగు ముందుకేసిన వారసులు.. న్యాయం జరక్కపోతే మెగాస్టార్ చిరంజీవి ఇంటి ముందు ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే వదిలే ప్రసక్తేలేదని వారసులు తేల్చిచెబుతున్నారు.

ఇప్పటికే ఈ ‘సైరా’ సినిమాను విడుదల చేయొద్దంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశామని చెబుతున్నారు.ఇందులో భాగంగా.. రాష్ట్ర ప్రభుత్వం, సెన్సార్ బోర్డ్ మెంబర్స్, చిత్ర హీరో చిరంజీవి, ప్రొడ్యూసర్ రామ్ చరణ్, అమితాబ్ బచ్చన్, డైరెక్టర్ సురేందర్ రెడ్డిని పిటిషన్‌లో బాధ్యులుగా చేర్చినట్లు ఉయ్యాలవాడ వారసులు తెలిపారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వారసులు, దక్షిణాది ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి సేవా సమితి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారసులు పై వ్యాఖ్యలు చేశారు.

Syraa Varasulu Warning To Cinema Team!:

Syraa Varasulu Warning To Cinema Team!
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs