Advertisement
Google Ads BL

RRR : అజ‌య్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా!


ఓటమి ఎరుగని దర్శకధీరుడిగా పేరుగాంచిన రాజమౌళి అలియాస్ జక్కన్న తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘RRR’. ఇప్పటికే ఈ భారీ చిత్రం షూటింగ్ విజయవంతంగా జరుపుకుంటోంది. ఈ సినిమాకు సంబంధించి చిన్న అప్డేట్ వచ్చినా అది పెద్ద సెన్సేషనే అవుతుంది. ఎందుకంటే సినిమా తెరకెక్కిస్తున్నామని మాత్రమే ఇంతవరకూ చెప్పిన దర్శకనిర్మాతలు పూర్తి వివరాలు వెల్లడించలేదు. దీంతో సినిమాపై అంచనాలు భారీగానే పెరిగిపోయాయి. ఒక్క  మాటలో చెప్పాలంటే ఈ సినిమాకు సంబంధించి అప్డేట్స్ కోసం సినీ ప్రియుల కంటే నటీనటులుగా ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. 

Advertisement
CJ Advs

అయితే తాజాగా.. ఈ సినిమాలో నటిస్తున్న బాలీవుడ్‌ టాప్ హీరోల్లో ఒకరైన అజయ్‌ దేవగణ్ గురించి ఓ ఆసక్తికర విషయం వెలుగుచూసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ‘RRR’లో ఈయ‌న పాత్రకు గాను దర్శకనిర్మాతలు గట్టిగానే ఇచ్చుకున్నారట. పది, పదిహేను కోట్లు కాదండోయ్ బాబూ.. రూ.30కోట్లు రెమ్యున‌రేష‌న్ ఇస్తున్నార‌ట‌. అయితే ఈయన సినిమాలో ఏ పాత్ర చేయబోతున్నారు..? పాత్ర చిన్నదా?  పెద్దదా?  అనేది మాత్రం ఇంతవరకూ తెలియరాలేదు. 

ఇదిలా ఉంటే.. ఇటీవ‌ల బల్గేరియాలో షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకున్న చిత్రబృందం త‌దుప‌రి షెడ్యూల్‌ను చ‌ర‌ణ్‌పై రాజ‌మౌళి ప్లాన్ చేస్తున్నాడ‌ట‌. అంతలోపు ఈ సైరా రిలీజ్ కావడం.. హంగామా కూడా పూర్తి అవుతుందని జక్కన్న భావిస్తున్నాడట. 

Ajay Devgn Shocking Remuneration for RRR Movie:

Ajay Devgn Shocking Remuneration for RRR Movie  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs