‘రాయలసీమ లవ్‌స్టోరీ’ మాస్ ఎంటర్‌టైనర్!


ఏ 1ఎంటర్టైన్మెంట్స్ మూవీస్ పతాకంపై రాయల్ చిన్నా, నాగరాజు నిర్మాతలుగా రామ్ రణధీర్ దర్శకత్వం వహించిన చిత్రం ‘రాయలసీమ లవ్ స్టోరీ’. వెంకట్, హృశాలి, పావని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం అన్నీ కార్యక్రమాలను ముగించుకొని ఈనెల 27న విడుదల కానుంది.  అయితే మరికొన్ని రోజుల్లో విడుదల కానున్న ఈ సినిమాపై కొంతమంది కొన్ని అభ్యంతరాలను వ్యక్తపరచడంతో చిత్ర యూనిట్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది.. ఈ సమావేశంలో

దర్శకుడు రామ్ రణధీర్  మాట్లాడుతూ.. ఇటీవలే మా చిత్ర ఆడియో వేడుక ప్రముఖ దర్శకుడు జి నాగేశ్వర్ రెడ్డి గారిచే విడుదల గావించబడి మంచి రెస్పాన్స్ ను పొందింది. ఈ నెల 27న సినిమా విడుదల కానున్న సందర్భంలో కొంత మంది రాయలసీమ ప్రాంత వాసులు మా సినిమాలో వల్గారిటీ ఉందంటూ, రాయలసీమ ప్రాంతాల వారి మనోభావాలను దెబ్బతీసేలా ఈ చిత్ర ట్రైలర్ మరియు పోస్టర్ లలో కనపడుతోంది అందుకే చిత్ర టైటిల్ ను మార్చాలని లేనిచో విడుదలను అడ్డుకుంటామంటూ బెదిరింపు కాల్స్ చేస్తున్నారు. అంతేకాకుండా పోస్టర్లను సైతం పలు ప్రాంతాల్లో చించి వేశారు. ఇవన్నీ ఎవరు చేస్తున్నారో కానీ వారికి నేను చెప్పేది ఒక్కటే.. మా ఈ రాయలసీమ లవ్ స్టోరీ అనేది కేవలం యూత్ కు మెసేజ్ ఇవ్వాలనే ఒక మంచి ఎమోషనల్ లవ్ స్టోరీని మాత్రమే ఈ చిత్రంలో చూపించనున్నామని, ఎవరైతే అడ్డుకుంటామని అంటున్నారో వారు సినిమాను చూసాక అభ్యంతరం ఏదైనా అనిపిస్తే అప్పుడు మీరు చెప్పినట్టుగా సినిమా టైటిల్ ను కానీ సన్నివేశాలను కానీ మారుస్తామని చెబుతూ తమ ఆవేదనను వ్యక్తపరిచారు.

హీరో వెంకట్ మాట్లాడుతూ.. టైటిల్ లోనే స్టోరీ మొత్తం చెప్పేసాము. కేవలం యూత్ ను అట్ట్రాక్ట్ చేయడానికే తప్పించి సినిమాలో ఎక్కడా వల్గారిటీ కానీ, ఎవరినైనా కించపరిచేలా కానీ  ఉండదు. మా సినిమా కేవలం ఒక రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో జరిగే ఎమోషనల్  ప్రేమకథ మాత్రమే.. అర్థం చేసుకొని ఆదరించాలని ఆశిస్తున్నా అన్నారు.

నిర్మాతలు  చిన్నా, మరియు నాగరాజులు మాట్లాడుతూ.. ఎంతో కస్టపడి మా చిత్ర యూనిట్ ఒక మంచి సినిమా చేశారు. విడుదలైన పాటలు కూడా చాలా మందిని ఆకట్టుకున్నాయి. అంతా సవ్యంగా జరుగుతుందనుకుంటున్న సమయంలో సినిమా కూడా విడుదల వరకు వచ్చాక కొంతమంది సినిమా టైటిల్ మార్చాలి అంటూ అభ్యంతరం వ్యక్తపరుస్తున్నారు. సినిమా ఈ నెల 27న విడుదల కానుంది. ఈ లోపే మా సినిమాను చూడకుండానే.. ఆ సినిమాలో ఏమిచెప్పారని తెలియకుండానే ఏ విధంగా సినిమాపై అభ్యంతరం వ్యక్త పరుస్తారని.. ఇది సబబు కాదని నా ఉద్ద్యేశ్యం. రాయలసీమ అనగానే బాంబులు, ఫ్యాక్షన్ అని మాత్రమే గుర్తుకువస్తాయి అందరికీ. కానీ వాళ్ళ ప్రేమ ఎలా ఉంటుందో తెలపడానికే ఈ చిత్రాన్ని నిర్మించాము కానీ మరే వల్గారిటీనో, మరొకరిని కించపరచడమో చూపించలేదు. మా సినిమా చూసాక అప్పుడు అభ్యంతరాలు ఏమైనా ఉంటే అప్పుడు మేము మీతో  ఏకీభవించి మీరు కోరినట్టుగానే మార్పులు చేస్తాము. అంతేకానీ ఇలా చిన్న సినిమాలపై ఆవేశం తగదని అన్నారు. అలానే నేటి సమాజంలోని యువతకు మంచి మెసేజ్ ఇవ్వాలనే తపనతోనే ఒక గొప్ప సినిమా చేసాము తప్పించి ఎవరినీ ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశ్యం తమది కాదని చెప్పుకొచ్చారు.

Rayalaseema Love Story: Mass Entertainer Film:

No Pornography in Rayalaseema Love Story says Director
Show comments


LATEST TELUGU NEWS


LATEST IN NEWS

POPULAR NEWS



LATEST IN GALLERIES

POPULAR GALLERIES