Advertisement
Google Ads BL

సైరా ఎఫెక్ట్.. గద్దలకొండ గణేష్ పై!


గత రెండు రోజులుగా వరుణ్ తేజ్ గద్దలకొండ గణేష్  కి భారీ ఓపెనింగ్స్ రావడమే కాదు.. శనివారం కూడా సినిమాకి మంచి కలెక్షన్స్ వచ్చాయి. మెగా ఫ్యాన్స్ కి సై రా కన్నా ముందు వచ్చిన వాల్మీకి సినిమా హిట్ మంచి జోష్ నిచ్చింది. అయితే సై రా సినిమా ఈవెంట్ తో వాల్మీకి సినిమాకి ఆదివారం సాయంత్రం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే కాదు.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ గండి పడింది. ఎందుకంటే ఆదివారం హైదరాబాద్ లో ఎల్బీ స్టేడియంలో నిర్వయించిన చిరంజీవి సై రా నరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం రాష్ట్రం నలుమూలల నుండి మెగా ఫ్యాన్స్ మొత్తం హైదరాబాద్ లో వాలారు.

Advertisement
CJ Advs

అలాగే శని, ఆదివారాల్లో సై రా ప్రీ రిలీజ్ ఈవెంట్ టికెట్స్ కోసం పడిగాపులు కాయడంతో వాల్మీకికి తెగాల్సిన భారీ టికెట్స్ కి గండి పడింది. ఇక ఆదివారం ఫస్ట్ షో, సెకండ్ షోకి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో థియేటర్స్ చాలావరకు బోసిపోయాయి. శుక్ర, శనివారాల్లో వచ్చిన కలెక్షన్స్ పరంగా చూసుకుంటే... ఆదివారం మాత్రం బాగా డ్రాప్ కనబడింది. సై రా సినిమా కోసం గత రెండేళ్లుగా మెగా ఫ్యాన్స్ నిరీక్షించడంతో సై రా ఈవెంట్ కోసం వాల్మీకిని లెక్కచేయలేదు.

Sye Raa Effect on Gaddalakonda Ganesh:

Sye Raa Pre Release Event.. No Collections to Valmiki 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs