Advertisement
Google Ads BL

హరీష్ శంకర్ స్కెచ్ అదిరింది..!


రీమేక్ అంటే అచ్చం ఒరిజినల్ ఎలా ఉందో అలా తీయడం. అలానే తీయాలని రూల్ కాదులెండి! కాకపోతే మన తెలుగు డైరెక్టర్స్ ఏమన్నా రీమేక్ చేస్తున్నప్పుడు అచ్చం ఒరిజినల్ ఎలా ఉందో అలానే తీస్తుంటారు. కానీ వాల్మీకి విషయంలో మాత్రం హరీష్ చాలా మార్పులు చేసాడు. మన నేటివిటీకి తగ్గట్టుగా, మన స్టైల్ కి తగ్గట్టుగా పాత్రలు మార్చేశాడు హరీష్.

Advertisement
CJ Advs

ముఖ్యంగా వరుణ్ తేజ్ పాత్ర పూర్తిగా మార్చేశాడు. ఒరిజినల్ లో కాకుండా ఇక్కడ వరుణ్ పాత్రను పూర్తి మాస్‌గా తయారు చేసి, అతడి లుక్, గెటప్, బాడీ లాంగ్వేజ్, మేనరిజమ్, డైలాగ్ డెలివరీ పూర్తిగా మార్చేశాడు. వరుణ్ తేజ్ ఆ హైట్ కి ఆ గెటప్ కి సరిగా సరిపోవడంతో సినిమా మొదటి రోజు నుండి స్ట్రాంగ్ గా ఆడుతుంది. మరో వైపు తమిళంలో లేని పూజా పాత్ర తీసుకొచ్చి వరుణ్ కి ఫ్లాష్ బ్యాక్ యాడ్ చేసాడు. అంతటితో ఆగలేదు ఇద్దరికీ ఎల్లువొచ్చి గోదారమ్మ అనే డ్యూయెట్ పెట్టాడు. మాస్ కి ఇంతకు మించి ఏమి కావాలి చెప్పండి?

లాస్ట్ లో సుకుమార్, నితిన్ లను తెచ్చి వారితో డైలాగ్స్ చెప్పించడం మరో హైలెట్. సుక్కు ఏమో లెక్కల మాస్టర్ గా, నితిన్ ఏమో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం ద్వారా థియేటర్ నుంచి కదులుతున్న మెగా అభిమానులు మంచి ఊపుతో బయటికి వెళ్లేలా చేశాడు. ఓ సినిమా హిట్ అవ్వడానికి ఓ డైరెక్టర్ ఏమి చేయాలో అన్ని హరీష్ చేసాడు. అందుకే ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. హరీష్ కి ప్రేక్షకులని ఎలా మాయ చేయాలో తెలుసు అనుకుంట.

Harish Shankar Sketch for Gaddalakonda Ganesh:

Harish Shankar Intelligent Director 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs