Advertisement
Google Ads BL

ఆ రెండు సినిమాల్ని పడుకోబెట్టేశాడుగా?


వాల్మీకిగా రచ్చ చేద్దామనుకుంటే... వాల్మీకిగా కాకుండా చివరి నిమిషంలో టైటిల్ మార్చుకుని గద్దలకొండ గణేష్ గా రచ్చ చేస్తున్నాడు వరుణ్ తేజ్. హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ గద్దలకొండ గణేష్ పాత్రలో ఇరగదీసాడు. మొదటినుండి వరుణ్ తేజ్ వాల్మీకి మీద భారీ అంచనాలే ఉన్నాయి. కారణం హరీష్ రీమేక్ స్పెషలిస్ట్. అలాగే వరుణ్ మాస్ మేకోవర్ తో వాల్మీకి సినిమా మీద మంచి అంచనాలే వచ్చాయి. తాజాగా విడుదలైన గద్దలకొండ గణేష్ సినిమా మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ రాబట్టి నాని గ్యాంగ్ లీడర్ కి సూర్య బందోబస్త్ కి చెక్ పెట్టింది.

Advertisement
CJ Advs

గతవారం విడుదలైన నాని గ్యాంగ్ లీడర్ యావరేజ్ టాక్ తో మొదట్లో మంచి కలెక్షన్స్ కొల్లగొట్టింది. కానీ రాను రాను వీక్ అవడంతో.. తాజాగా వాల్మీకి చేతిలో బలైంది. గ్యాంగ్ లీడర్ కలెక్షన్స్ నిన్న శుక్రవారం నుండి దారుణంగా పడిపోయాయి. ఇక వాల్మీకితో పోటీగా విడుదలైన సూర్య బందోబస్త్ లో బలం లేక వాల్మీకి ముందు సాగిల పడింది. సూర్య బందోబస్త్ మొదటి రోజు వీక్ ఓపెనింగ్స్ తో సినిమా మీద ఇంట్రెస్ట్ చంపేసింది. ఇక వాల్మీకి సినిమాకి ఈ శని ఆదివారాలు బుకింగ్స్ కళకళలాడుతున్నాయి. దానితో ఈ ఫస్ట్ వీకెండ్ లో వాల్మీకి కలెక్షన్స్ పరంగా మెరుగ్గా ఉంటే.. నాని గ్యాంగ్ లీడర్, సూర్య బందోబస్త్ లు ఉసూరుమనాల్సిందే. 

Gaddalakonda Ganesh vs Gang leader and Bandobast:

Gaddalakonda Ganesh gets Hit Talk at Box Office
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs