Advertisement
Google Ads BL

తప్పు మీద తప్పులు చేస్తే ఎలా ‘నాని’!!


నేచురల్ స్టార్ నాని.. ఎలాంటి బ్యాక్ సపోర్ట్ లేకుండా సింపుల్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేసి కలలో కూడా ఊహించని రేంజ్‌కు వెళ్లిపోయాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇందుకు కారణం.. భిన్న కథలను సెలెక్ట్ చేసుకోవడమే. ఫలానా పాత్ర అంటే నాని తప్ప మరెవ్వరికి సెట్ అవ్వదంతే అన్నట్లుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఈ మధ్య నానికి పెద్దగా కాలం కలిసిరావట్లేదు. ‘కృష్ణార్జున యుద్ధం’ ఈయన విజయాలకు బ్రేక్ వేసిందని టాక్ నడుస్తోంది. 

Advertisement
CJ Advs

ఇందుకు కారణం ఈ మధ్య నాని తప్పు మీద తప్పులు చేస్తూ చేజేతులారా హిట్‌లను పొగొట్టుకుంటున్నాడట. వాస్తవానికి ‘కృష్ణార్జున యుద్ధం’, ‘గ్యాంగ్ లీడర్’ ఈ రెండు సినిమాలు నాని కోసం అనుకున్నవి కాదట. అనుకున్న హీరో ‘అబ్బే.. నేను ఇలాంటి సినిమాలు చేయడమా.. అస్సలు చేయను బాబోయ్’ అని రిజెక్ట్ చేసిన తర్వాతే ఈ రెండు కూడా నాని దగ్గరికి వచ్చి పడ్డాయట. నేచురల్ స్టార్ మాత్రం కాస్త కథ వినగానే ‘అబ్బో ఇంతకు మించి కథ ఇంకెక్కడ దొరుకుతుంది..’ అని ఆనందపడిపోయి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట.

‘కృష్ణార్జున యుద్ధం’ మూవీని దర్శకుడు మేర్లపాక గాంధీ.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కోసం రాసుకోగా... ‘గ్యాంగ్ లీడర్’ మాత్రం విక్రమ్ కుమార్ అల్లు అర్జున్ కోసం కథ రాసుకున్నాడట. బన్నీకి ఈ కథ నచ్చినా.. సెకండ్ హాఫ్‌పై అంతగా నచ్చకపోవడంతో సైడ్ అయ్యాడట. అలా ఆ రెండు సినిమాలను మెగా హీరోలు వదులుకోవడంతో నానికి నచ్చి చేశాడు. కొందరికి ఇలాంటి రిజెక్టెడ్ కథలు సూపర్ హిట్స్ అయినప్పటికీ.. నానికి మాత్రం అస్సలు కలిసిరాలేదు.. అంతేకాదు ఉన్న పేరును పోగొట్టాయి. ఇక ముందైనా నాని ఇలాంటి కథలకు దూరంగా ఉంటే మంచిదేమోనని సినీ విమర్శకులు, విశ్లేషకులు సూచిస్తున్నారు.

Nani Makes Mistake.. Cinema Gone!:

Nani Makes Mistake.. Cinema Gone!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs