Advertisement
Google Ads BL

పూజాను ఇంప్రెస్ చేయడానికి ఆ రెండే చాలట


పూజా హెగ్దే.. పూజా హెగ్దే.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా ఈ పేరే వినపడుతోంది. ఒకప్పుటి సీనియర్లు, ఇప్పటి జూనియర్ హీరోయిన్లు సైతం ఈమె ముందు అస్సలు నిలవలేకపోతున్నారు. అంతేకాదు.. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రస్తుతానికి టాలీవుడ్‌ను ఏలుతున్న క్వీన్.. స్టార్ హీరోయిన్ అనిచెప్పినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదేమో. ‘ఒక లైలా కోసం’ అంటూ ఏ క్షణాన టాలీవుడ్‌లోకి ఈ భామకు ఆఫర్లే.. ఆఫర్లు.. అలా ఈ భామకు కాలం కలిసి వస్తోంది.

Advertisement
CJ Advs

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ బ్యూటీ నటించిన ‘వాల్మీకి’ అలియాస్ ‘గద్దలకొండ గణేష్’లోని పాత్ర మెగాభిమానులను చాలా బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా పూజా ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇదే ఇంటర్వ్యూలో తనకు ఎలాంటి అబ్బాయి కావాలి..? తనను ఇంప్రెస్ చేయాలంటే ఏవేవి.. కావాలి..? అనే విషయాలను పంచుకుని అభిమానులు ఆశ్చర్యచకితులను చేసింది.

‘నన్ను ఇంప్రెస్ చేయాలంటే ‘మంచి ఫుడ్’ లేదా ‘కాండిల్ లైట్ డిన్నర్‌’కి తీసుకెళ్తే చాలు. నేను మంచి ఫుడ్ లవర్‌‌ని.. నన్ను పడేయాలంటే మంచి రుచికరమైన ఫుడ్ ఆఫర్ చేస్తే చాలు. వీటికి పాటు వినయం, ఇంటెలిజెంట్ ఈ రెండు లక్షణాల కలిగిన అబ్బాయి అయితే నేను చాలా ఈజీగా అట్ట్రాక్ట్ అవుతాను. అంతేకాదండోయ్.. బయటకు వెళ్ళేటప్పుడు ఎప్పుడూ ఒక జత బట్టలు, కళ్ళజోడు మాత్రం తన వెంట ఉండాల్సిందే’ అని తన మనసులోని మాటను పూజా బయటపెట్టింది. మరి ఈమెకు ఇంట్రెస్ట్‌కు సరితూగే హీరోలెవరైనా ఉన్నారో..? లేకుంటే కుర్రకారే ఈ ముద్దుగుమ్మను లైన్‌లో పెట్టడానికి క్యూ కడతారో వేచి చూడాలి మరి.

I Will Impress Those Two Things Said Pooja Hegde!:

I Will Impress Those Two Things Said Pooja Hegde!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs