Advertisement
Google Ads BL

బిగ్‌బీకి ప్రేమతో చిరు మరిచిపోలేని గిఫ్ట్!


తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడి జీవిత గాథ ఆధారంగా సురేందర్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. ఈ సినిమాను మెగాస్టార్ చిరంజీవి ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. త్వరలో అనగా అక్టోబర్-02న ‘సైరా’ వీరాభిమానులు, సినీ ప్రియుల ముందుకు రాబోతున్నాడు. ఈ క్రమంలో చిత్ర ప్రమోషన్స్ గట్టిగానే చేయాలని సినిమా యూనిట్ భావించింది. ఓ వైపు ప్రమోషన్స్ షురూ చేస్తుండగా... మరో చిత్రానికి సంబంధించిన ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఇప్పటికే రెమ్యునరేషన్‌, నయన్, తమన్నా గురించి పలు విషయాలు లీకవ్వగా.. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ విషయం వెలుగుచూసింది.

Advertisement
CJ Advs

సైరాలో బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. చిరు ఆకాంక్ష మేరకు చిత్రబృందం అడగ్గానే కాదనకుండా అమితాబ్ ఈ సినిమాలో చేశారు. అంతేకాదు.. షూటింగ్‌కు వెళ్లి రావడానికి ఫ్లైట్ టికెట్లు, కనీసం రెమ్యునరేషన్ ఒక్కరూపాయి తీసుకోలేదట. అందుకే బిగ్‌ బీకీ ఎప్పుడూ మరిచిపోలేని గిఫ్ట్ ఇవ్వాలని భావించిన చిరు.. ‘బిగ్‌బీకి ప్రేమతో’ అంటూ ఓ గోల్డ్ రింగ్ ఇచ్చారట. దీన్ని చిరు తన పెద్ద కుమార్తె సుస్మితతో డిజైన్ చేయించారట. అంతేకాదండోయ్.. ఈ రింగ్ బయట కొనాలన్నా.. గట్టిగానే ఖరీదు అవుతుందట. ఈ రింగ్‌ చూసిన అమితాబ్, కుటుంబ సభ్యులు వావ్ అన్నారట. ప్రస్తుతం ఈ విషయం టాలీవుడ్‌లో కోడై కూస్తోంది. అయితే ఇందులో ఎంత మాత్రం నిజముందో తెలియాల్సి ఉంది.

Chiru Gives Gift To Big B Amithab!:

Chiru Gives Gift To Big B Amithab!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs