Advertisement
Google Ads BL

ఇప్పుడు గ్యాంగ్ లీడర్ పరిస్థితి ఏంటి?


నాని క్రేజ్ తో యావరేజ్ టాక్ వచ్చిన గ్యాంగ్ లీడర్ కి ఫస్ట్ వీకెండ్ లో అదరగొట్టే కలెక్షన్స్ వచ్చాయి. మొదటి వారానికే నాని గ్యాంగ్ లీడర్ బ్రేక్ ఈవెన్ సాధించడం గ్యారెంటీ అన్నారు. నాని క్రేజ్ ఫస్ట్ వీకెండ్ వరకే పని చేసింది. గ్యాంగ్ లీడర్ అసలు రంగు సోమవారం నుండే బయటపడింది. గ్యాంగ్ లీడర్ కలెక్షన్ సోమవారం వీక్ డేస్ మొదలవడంతోనే డ్రాప్ అవడం మొదలైంది. అలా ఫస్ట్ వీక్ గడిచేసరికి నాని గ్యాంగ్ లీడర్ వరల్డ్ వైడ్ గా 8.96 కోట్ల గ్రాస్ రాబట్టింది.

Advertisement
CJ Advs

ఇక ఈ శుక్రవారం నుండి గ్యాంగ్ లీడర్ సినిమాకి కష్టాలు స్టార్ట్ అయ్యాయి. అసలే భారీ వర్షాలు. దానికి తోడు వరుణ్ తేజ్ గద్దలకొండ గణేష్, సూర్య బందోబస్త్ చిత్రాలు గ్యాంగ్ లీడర్ కి విలన్ గా తయారయ్యాయి. వాల్మీకి, బందోబస్త్ కి ఎంతగా యావరేజ్ టాక్ పడినా..  ఆ రెండు సినిమాల వలన నాని గ్యాంగ్ లీడర్ కలెక్షన్స్ పూర్తిగా పడిపోతాయి. నాని క్రేజ్ కూడా ఈ రెండు సినిమాలను దాటి పని చెయ్యడం కష్టం. వాల్మీకి సినిమాకి యావరేజ్ టాకొచ్చినా.. బిసి సెంటర్స్ లో ఆ సినిమా కలెక్షన్స్ బావుంటాయి. ఇక సూర్య బందోబస్త్ కి యావరేజ్ టాకే పడింది. మరి ఈ రెండు సినిమాల మధ్యన గ్యాంగ్ లీడర్ నలిగిపోవడం ఖాయం.

What is the Gang Leader Situation?:

Gang Leader Collections Dropped
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs