Advertisement
Google Ads BL

ఎన్టీఆర్‌కు యమా డిమాండ్.. 4 టాప్ డైరెక్టర్స్ క్యూ!


అవును మీరు వింటున్నది.. టాలీవుడ్ కుర్రహీరో జూనియర్ ఎన్టీఆర్ కోసం ఒకరు కాదు.. ఇద్దరు కాదు ఏకంగా నలుగురు టాప్ డైరెక్టర్స్ క్యూ కడుతున్నారట. అయితే వీరిలో ఇద్దరు ఇదివరకే జూనియర్‌తో సినిమాలు తీసిన దర్శకులు కాగా.. మరో ఇద్దరు మాత్రం ఇతర ఇండస్ట్రీల నుంచి పోటీపడుతున్నారు. అంటే టాలీవుడ్‌కు చెందిన ఇద్దరు దర్శకులు.. తమిళ, మలయాళ డైరెక్టర్ ఇలా మొత్తం నలుగురు జూనియర్ ఎప్పుడెప్పుడు అపాయింట్మెంట్ ఇస్తారా..? ఎప్పుడెప్పుడు నందమూరి కాంపౌండ్‌లో అడుగుపెడదామా..? అని వేచి చూస్తున్నారట.

Advertisement
CJ Advs

ఆ దర్శకులు మరెవరో కాదండోయ్.. త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ, అట్లీ, ప్రశాంత్ నీల్. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ విషయానికొస్తే.. ‘అరవింద సమేత’ తర్వాత మరోసారి సినిమా తెరకెక్కించాలని భావించారట. అన్నీ అనుకున్నట్లు జరిగితే అల్లు అర్జున్‌తో తెరకెక్కిస్తున్న ‘అల వైకుంఠపురములో..’ తర్వాత జూనియర్‌తో సినిమా పట్టాలెక్కించాలని తివిక్రమ్ భావిస్తున్నారట. కొరటాల విషయానికొస్తే.. ‘సైరా’ తర్వాత మెగాస్టార్ చిరంజీవితో తెరకెక్కించడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా పూర్తవ్వగానే ఎన్టీఆర్‌తో సినిమా తీయాలని భావిస్తున్నారు. అంతేకాదు.. తమిళ టాప్ డైరెక్టర్ అట్లీ, ‘కేజీఎఫ్’ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే దాదాపు వీరంతా ఎన్టీఆర్‌తో చర్చించగా.. మరికొందరూ స్టోరీ వినిపించి ఫైనల్ చేసుకోవడానికి సిద్ధమవుతున్నారట.

ఈ క్రమంలో ఎన్టీఆర్ ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారో..? ఎవరికి హ్యాండిస్తారో..? మరి. మొత్తానికి చూస్తే యంగ్ టైగర్‌ కి యమా డిమాండ్ ఉన్నట్లు దీన్ని బట్టి స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాలి మరి. కాగా.. ప్రస్తుతం ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్‌లతో దర్శకధీరుడు రాజమౌళి భారీ బడ్జెట్ సినిమా ‘ఆర్ఆర్ఆర్’ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

4 Top Directors Waiting for Jr NTR:

Young Tiger NTR Next Films Update
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs