Advertisement
Google Ads BL

‘రాయలసీమ లవ్‌స్టొరీ’ డైరెక్టర్‌కు బెదిరింపులు


‘రాయలసీమ లవ్‌స్టొరీ’ చిత్ర దర్శకుడు రామ్ రణధీర్‌కు బెదిరింపు కాల్స్ వస్తున్న నేపథ్యంలో పత్రికా ప్రకటన విడుదల చేసారు. ‘రాయలసీమ లవ్‌స్టొరీ’ ఈ నెల 27న విడుదల అవుతున్న నేపథ్యంలో సినిమా టైటిల్ మార్చాలని లేదంటే సినిమా విడుదలను అడ్డుకుంటామని హెచ్చరికలు చేస్తున్నారని, నేను సినిమానే ఆశ , శ్వాసగా బతుకుతున్న వాడ్ని అంటూ తీవ్ర ఆవేదన వెలిబుచ్చారు దర్శకులు రామ్ రణధీర్. వెంకట్, హృశాలి, పావని హీరో హీరోయిన్‌లుగా పంచలింగాల బ్రదర్స్ నిర్మించిన ‘రాయలసీమ లవ్‌స్టొరీ’ ఈనెల 27న విడుదలకు సిద్దమైన నేపథ్యంలో వరుసగా కొంతమంది పనిగట్టుకొని ఫోన్‌లు చేస్తూ బెదిరిస్తున్నారని వాపోయాడు.

Advertisement
CJ Advs

నాకు దర్శకుడిగా ఇది మొదటి సినిమా, ఈ సినిమాపై నా జీవితం ఆధారపడి ఉన్న నేపథ్యంలో చిన్న సినిమాని అడ్డుకోవడానికి ఇలా హెచ్చరికలు రావడంతో తన సినిమాకు ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్దలు సహకరించాలని, విడుదలకు అన్ని ఏర్పాట్లను చేసుకున్న తర్వాత ఇప్పుడు టైటిల్ మార్చడం అంటే మాకు ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని, ఇప్పటికే ‘రాయలసీమ లవ్‌స్టొరీ’ పేరుతో పబ్లిసిటీ చేస్తున్నామని  ఆవేదన వెలిబుచ్చాడు దర్శకుడు రామ్ రణధీర్.

Threat Call to Rayalaseema Love Story Director:

Rayalaseema Love Story Director Press Note
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs