Advertisement
Google Ads BL

‘కృష్ణారావ్ సూప‌ర్‌ మార్కెట్’ రిలీజ్‌కు రెడీ!


అక్టోబర్ 18న కృష్ణారావ్ సూప‌ర్‌ మార్కెట్ విడుదల

Advertisement
CJ Advs

బిజెఆర్ ఫిల్మ్ అండ్ టివి స్టూడియోస్ బ్యాన‌ర్ పై ప్ర‌ముఖ క‌మెడియ‌న్ గౌతంరాజు కుమారుడు కృష్ణ హీరోగా రూపొందిన చిత్రం  ‘కృష్ణారావ్ సూప‌ర్‌మార్కెట్’.  శ్రీ‌నాధ్ పుల‌క‌రం ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇటీవ‌ల విడుద‌ల‌ చేసిన టీజ‌ర్‌కి మంచి రెస్పాన్స్ రావ‌డంతో ట్రేడ్ వ‌ర్గాల్లో సినిమాపై ఆస‌క్తి నెల‌కొంది. అక్టోబర్ 18న గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు.

ఈ సందర్భంగా ద‌ర్శ‌కుడు శ్రీ‌నాధ్ పుల‌కుర‌మ్ మాట్లాడుతూ.. ‘‘కృష్ణారావ్ సూప‌ర్‌ మార్కెట్ అనేది ఒక సస్పెన్స్ థ్రిల్లర్. సూపర్ మార్కెట్ చుట్టూనే కథ నడుస్తుంది కాబట్టి ఈ టైటిల్ పెట్టడం జరిగింది. హీరో కృష్ణ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఈ సినిమా ద్వారా ఆయనకు మంచి పేరు వస్తుంది. అలాగే  హీరోయిన్ ఎల్సా కూడా బాగా న‌టించింది. ఇద్దరు డేడికేటెడ్ ఆర్టిస్టులు. ప్రస్తుతం థ్రిల్లర్ కథలకు మంచి ఆదరణ లభిస్తోంది. మంచి కంటెంట్‌తో సస్పెన్స్ థ్రిల్లర్‌గా వస్తున్న కృష్ణారావ్ సూప‌ర్‌ మార్కెట్ తప్పకుండా ప్రతి ఒక్కరికీ నచ్చే చిత్రం అవుతుంది..’’ అన్నారు.

చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘ఇప్పటికే విడుదలైన టీజర్‌కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ రావడంతో మా సినిమాకు మంచి బజ్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి అక్టోబర్ 18న  గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు.

న‌టీన‌టులు... కృష్ణ‌, ఎల్సాగోష్‌, త‌నికెళ్ళ‌భ‌ర‌ణి, గౌతంరాజ్‌, బెన‌ర్జీ, ర‌విప్ర‌కాష్‌, సూర్య‌, స‌న‌, దొర‌బాబు, సంజు, స‌హ‌స్ర‌,  త‌దిత‌రులు న‌టిస్తున్నఈ చిత్రానికి

మ్యూజిక్: బోలే ష‌వాలీ,

ఫైట్స్: సింధూరం సతీష్

కెమెరామెన్: ఎ. విజ‌య్‌కుమార్‌,

ఎడిట‌ర్: మార్తాండ్‌, కె.వెంక‌టేష్‌,

నిర్మాత: బిజెఆర్ ఫిల్మ్ అండ్ టివి స్టూడియోస్‌,

ప్రాజెక్ట్ అడ్వైజర్: కె. భువన్ రెడ్డి,

ద‌ర్శ‌కుడు: శ్రీ‌నాధ్ పుల‌కుర‌మ్

Krishnarao Super Market Release Date Fixed:

Krishnarao Super Market Release On October 18
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs