Advertisement
Google Ads BL

‘90 ఎం.ఎల్‌’లో కార్తికేయ‌ పేరు ఇదే!


ఆథ‌రైజ్డ్ డ్రింక‌ర్ దేవ‌దాస్‌గా ‘90 ఎం.ఎల్‌’ చిత్రంలో కార్తికేయ‌

Advertisement
CJ Advs

‘ఆర్ ఎక్స్ 100, హిప్పీ, గుణ‌369’ చిత్రాల‌తో క‌థానాయ‌కునిగా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు కార్తికేయ‌. ఇటీవ‌లే వచ్చిన ‘గ్యాంగ్ లీడ‌ర్‌’లో ప్ర‌తినాయ‌కునిగా కూడా న‌టించి మంచి మార్కులు సంపాదించుకున్నారు. ప్ర‌స్తుతం కార్తికేయ ‘90 ఎం.ఎల్‌’ చిత్రం చేస్తున్నారు. ‘ఆర్ ఎక్స్ 100’ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం తీసిన కార్తికేయ క్రియేటివ్ వ‌ర్క్స్ ప‌తాకంపై అశోక్ రెడ్డి గుమ్మ‌కొండ ‘90 ఎం.ఎల్‌’ సినిమా నిర్మిస్తున్నారు. శేఖ‌ర్ రెడ్డి ఎర్ర ద‌ర్శ‌కునిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. సెప్టెంబ‌ర్ 21(శ‌నివారం) కార్తికేయ గుమ్మ‌కొండ పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా శ‌నివారం ఉద‌యం 10 గంటల 35 నిమిషాల‌కు ‘90 ఎం.ఎల్‌’ టీజ‌ర్‌ని విడుద‌ల చేయ‌నున్నారు.

ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ రెడ్డి ఎర్ర ఈ సినిమా గురించి చెబుతూ.. ‘‘ఇందులో హీరో కార్తికేయ పోషిస్తున్న పాత్ర పేరు ‘దేవ‌దాస్‌’. ఎంబీఏ గోల్డ్ మెడ‌లిస్ట్. అంత‌టి విద్యావంతుడు ఆథ‌రైజ్డ్ డ్రింక‌ర్‌గా పాపుల‌ర్ అవుతాడు. అత‌ను ఎందుకు డ్రింక‌ర్ అయ్యాడు? ముఖ్యంగా ఆథ‌రైజ్డ్ డ్రింక‌ర్‌గా ఎందుకు పేరు తెచ్చుకున్నాడు? అలాంటి అంశాలు చాలా ఆస‌క్తిక‌రంగా ఉంటాయి. హిలేరియ‌స్ మాస్ ఎంట‌ర్‌టైన‌ర్ ఇది. ఫ్యామిలీ ఆడియ‌న్స్ అంతా కూర్చుని ఎంజాయ్ చేసే విధంగా సినిమా ఉంటుంది’’ అన్నారు.

నిర్మాత అశోక్ రెడ్డి గుమ్మ‌కొండ మాట్లాడుతూ.. ‘‘మా హీరో కార్తికేయ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా టీజ‌ర్ విడుద‌ల చేస్తున్నాం. టీజ‌ర్‌ని బ‌ట్టే సినిమా ఎలా ఉంటుందో అర్థ‌మైపోతుంది. కామ‌న్ మేన్‌కి కూడా క‌నెక్ట్ అయ్యే విధంగా ఈ సినిమా కాన్సెప్ట్ ఉంటుంది. ఇటీవ‌లే హైద‌రాబాద్‌లోని అన్న‌పూర్ణ ఏడెక‌రాల స్టూడియోలో వేసిన సెట్‌లో భారీ ఎత్తున క్లైమాక్స్ చిత్రీక‌రించాం. అక్టోబ‌ర్ 7వ తేదీకి మొత్తం టాకీ పార్ట్ చిత్రీక‌ర‌ణ పూర్త‌వుతుంది. మూడు పాట‌ల‌ను యూర‌ప్‌లోని అంద‌మైన ప్ర‌దేశాల్లో చిత్రీక‌రిస్తాం’’ అని తెలిపారు.

కార్తికేయ‌, నేహా సోలంకి (తొలి ప‌రిచ‌యం), ర‌వికిష‌న్‌, రావు ర‌మేష్‌, అలీ, పోసాని కృష్ణ‌ముర‌ళి, అజ‌య్‌, కాల‌కేయ ప్ర‌భాక‌ర్‌, స‌త్య‌ప్ర‌కాష్‌, ప్ర‌గ‌తి, ప్ర‌వీణ్, అదుర్స్ ర‌ఘు, నెల్లూరు సుద‌ర్శ‌న్‌, తాగుబోతు ర‌మేశ్‌, రోల్ రిడా, దువ్వాసి మోహ‌న్‌, సంజ‌య్ స్వ‌రూప్ త‌దిత‌రులు ఈ చిత్ర ప్ర‌ధాన తారాగ‌ణం.

ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, పాట‌లు: చ‌ంద్ర‌బోస్‌, కెమెరా: జె.యువ‌రాజ్‌, ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖ‌ర్‌, ఆర్ట్: జీఎం శేఖ‌ర్‌, ఫైట్స్: వెంక‌ట్‌, నృత్యాలు: ప్రేమ్ ర‌క్షిత్‌, జానీ, కో డైర‌క్ట‌ర్‌:  సిద్ధార్థ్ రెడ్డి గూడూరి, ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్‌: కె.సూర్య‌నారాయ‌ణ‌, నిర్మాత‌: అశోక్ రెడ్డి గుమ్మ‌కొండ‌, ర‌చ‌న - ద‌ర్శ‌క‌త్వం: శేఖ‌ర్ రెడ్డి ఎర్ర‌.  

Karthikeya Name Revealed in 90 ML Movie:

Karthikeya turns Authorised Drinker Devadas
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs