Advertisement
Google Ads BL

‘వ‌రల్డ్ ఫేమ‌స్ ల‌వర్’ ఫ‌స్ట్ లుక్


క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్ బ్యాన‌ర్‌పై విజ‌య్ దేవ‌ర‌కొండ‌, క్రాంతి మాధ‌వ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం ‘వ‌రల్డ్ ఫేమ‌స్ ల‌వర్’ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

Advertisement
CJ Advs

క్రేజీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ కె.ఎస్‌.రామారావు స‌మర్ప‌ణ‌లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్ బ్యాన‌ర్‌పై క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో కె.ఎ.వ‌ల్ల‌భ నిర్మిస్తోన్న చిత్రం ‘వ‌ర‌ల్డ్ ఫేమస్ ల‌వ‌ర్‌’. ఈ టైటిల్‌ను రీసెంట్‌గా ప్ర‌క‌టించారు. టైటిల్ లోగోను కూడా విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. దానికి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

లాంగ్ హెయిర్‌, గ‌డ్డంతో ఉన్న‌ విజ‌య్‌దేవ‌ర‌కొండ లుక్‌ను ఫ‌స్ట్ లుక్‌గా చిత్ర యూనిట్ శుక్ర‌వారం విడుద‌ల చేసింది. ఇందులో విజ‌య్‌దేవ‌ర‌కొండ ముఖంపై ఉన్న ర‌క్త‌పు మ‌ర‌క‌లు క్యారెక్టర్ ఇన్‌టెన్సిటినీ తెలియ‌జేస్తుంది. రాశీఖ‌న్నా, ఐశ్వ‌ర్యా రాజేశ్‌, క్యాథ‌రిన్ ట్రెసా, ఇజాబెల్లా లెయితే హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. డైరెక్ట‌ర్ క్రాంతి మాధ‌వ్ సెన్సిబుల్ క‌థాంశంతో ఈ చిత్రాన్నిఅద్భుతంగా తెర‌కెక్కిస్తున్నార‌ని, టైటిల్ జ‌స్టిఫికేష‌న్ తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందేన‌ని చిత్ర యూనిట్ చెబుతుంది. ప్రస్తుతం సినిమా హైద‌రాబాద్‌లో చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది. నేషన‌ల్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ గోపీసుంద‌ర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి జ‌య‌కృష్ణ గుమ్మ‌డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

న‌టీన‌టులు:

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, రాశీఖ‌న్నా, ఐశ్వ‌ర్యా రాజేశ్‌, క్యాథ‌రిన్ ట్రెసా, ఇజాబెల్లా లెయితే త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

ద‌ర్శ‌క‌త్వం: క్రాంతి మాధ‌వ్‌

నిర్మాత‌: కె.ఎ.వ‌ల్ల‌భ‌

స‌మ‌ర్ప‌ణ‌: కె.ఎస్‌.రామారావు

సంగీతం: గోపీ సుంద‌ర్‌

కెమెరా: జ‌య‌కృష్ణ గుమ్మ‌డి

ఆర్ట్‌: సాహి సురేశ్‌

పి.ఆర్‌.ఓ: వంశీ శేఖ‌ర్‌

World Famous Lover First Look out:

World Famous Lover More Ferocious Than Arjun Reddy!
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs