Advertisement
Google Ads BL

అధర్వకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదా?


తమిళనటుడు అధర్వ మురళి డైరెక్ట్ తెలుగు సినిమాలో నటించడం ఇదే మొదటిసారి. హరీష్ శంకర్ కోరిక మేరకు అధర్వ.. వాల్మీకి సినిమాలో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఒరిజినల్ ‘జిగర్తాండ’లో సిద్దార్థ్ చేసిన పాత్ర ఇది. అందులో సిద్ధార్థ ది ఏమి అంత తీసేసే పాత్ర కాదు. అతనికంటూ ఓ స్టోరీ ఉంటుంది.

Advertisement
CJ Advs

కానీ తెలుగులో అధర్వకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు అని అర్ధం అవుతుంది. హరీష్ శంకర్ ఫుల్ ఫోకస్ మొత్తం వరుణ్ తేజ్‌ మీదే పెట్టాడని తెలుస్తుంది. వరుణ్ తేజ్ కి ఫ్లాష్ బ్యాక్ సైతం యాడ్ చేశాడు హరీష్. వరుణ్ తేజ్ తరువాత అంతటి స్థానంలో పూజా హెగ్డే ఉంది. ఈమెది ఏమి ఫుల్ లెంగ్త్ పాత్ర కాకపోయినా ఉన్నంత సేపు ఆమె పాత్ర బాగుంటుందని చెబుతున్నారు. అంతా వరుణ్ తేజ్, పూజ గురించే మాట్లాడుతున్నారు కానీ అధర్వ గురించి మాట్లాడుకునేవాళ్లే కరవయ్యారు.

ప్రోమోస్ అన్ని కూడా వరుణ్ అండ్ పూజా లనే హైలైట్ చేస్తూ రిలీజ్ చేసారు. హరీష్ శంకర్ అధర్వ పాత్ర బాగుంటదని చెబుతున్నాడు కానీ ఈ పాత్ర కోసం హరీష్ మొదట నాగశౌర్య సహా ఇద్దరు ముగ్గుర్ని ట్రై చేసి చివరికి అధర్వని తీసుకున్నాడు. తెలుగులో మంచి పేరు తెచ్చుకుందాం అనుకున్న అధర్వకి ఇది నిజంగా నిరాశే. చూద్దాం మరికొన్ని గంటల్లో అధర్వ పాత్రకు అసలు ఇంపార్టెన్స్ ఇచ్చారో లేదో అని.

No Importance to Atharva Role in Valmiki:

Gossips about Atharva Role in Valmiki Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs