Advertisement
Google Ads BL

అక్కినేనీ’స్ మల్టిస్టారర్‌కు డైరెక్టర్ ఆయనేనా!


టాలీవుడ్‌లో ప్రస్తుతం మల్టీ్స్టారర్ సినిమాలకే ఎక్కువగా గిరాకీ ఉంది. అందుకే స్టార్ హీరోలు సైతం మల్టీస్టారర్ సినిమాకే మొగ్గు చూపుతూ హిట్‌ తమ ఖాతాలో వేసుకుంటున్నారు. ఇందుకు ప్రత్యేకించి మరీ ఆ హీరోల పేర్లు చెప్పనక్కర్లేదు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే ‘మనం’ సినిమాతో అక్కినేని ఫ్యామిలీలో అందరూ నటించి మెప్పించారు.. ఈ సినిమాకు ఆశించిన దానికంటే గట్టిగానే కలెక్షన్ల వర్షం కురిసింది.

Advertisement
CJ Advs

అయితే.. అక్కినేని కుటుంబంలో నాగార్జున, నాగ చైతన్య, అఖిల్‌ ముగ్గురికీ ఈ మధ్య జనాలు పెద్దగా హిట్టివ్వలేదు. నాగ్ మన్మథుడు-2తో అట్టర్ ప్లాప్‌ను ఖాతాలో వేసుకోగా.. చైతూ మాత్రం ఇంతకముందు ‘మజిలీ’ మూవీతో పర్లేదని అనిపించుకున్నాడు. అయితే అఖిల్‌కు ఇంతవరకూ హిట్ అస్సలు పడలేదు. ఇలా వరుస ప్లాప్‌లతో అక్కినేని ఫ్యామిలీ సతమతవుతున్న టైమ్‌లో నాగ్‌కు ‘మల్టీస్టారర్’ మూవీ చేయాలనే ఆలోచన వచ్చిందట. అందుకే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కుటుంబ సభ్యులతో చర్చించి ఒకరిద్దరు డైరెక్టర్స్‌ను కూడా సంప్రదించారట.

అయితే ఫైనల్‌గా..‘ఆరెక్స్ 100’ తెరకెక్కించి సంచలనం సృష్టించిన అజయ్ భూపతి తాను ఈ మూవీకి రెడీ అని చెప్పాడట. అంతేకాదు.. తనదగ్గరున్న స్కిప్ట్ వినిపించగా.. నాగ్‌కు లైన్ బాగా నచ్చిందని టాక్ నడుస్తోంది. వాస్తవానికి తన దగ్గరున్న కథతో ఇప్పటికే ర‌వితేజ‌తో పాటు ఒకరిద్దర్ని సంప్రదించి వర్కవుట్ అవ్వకపోవడంతో ఫైనల్‌గా ఈ ప్రయోగం అక్కినేని ఫ్యామిలీపై చేయడానికి అజయ్ సిద్ధమయ్యారట. మరి ఇది ఎంతవరకు వర్కవుట్ అవుతుందో!

Akkineni’s Multi Starrer Movie Director...!!:

Akkineni’s Multi Starrer Movie Director...!!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs