ఇదేంటి.. ఏపీ యంగ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. సూపర్ హిట్‌చిత్రాల నిర్మాత దిల్‌రాజుకు ఝలక్ ఇవ్వడమా..? అసలు వీరిద్దరికీ మధ్య ఉన్న సంబంధమేంటి..? అనే సందేహం కలుగుతోందా..? ఇక ఆలస్యమెందుకు ఆర్టికల్ చదివేయండి అసలు విషయమేంటో మీకే తెలిసిపోతుంది.
దిల్‌రాజు.. తిరుమల వెంకన్న భక్తుడు అనే విషయం తెలిసిందే. అందుకే తన బ్యానర్ పేరు కూడా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అని పెట్టుకున్నారు కూడా. వారి కులదైవం బాలాజీ గనుక ఆయన పరమ భక్తుడిగా మారిపోయారు. ఇక అసలు విషయానికొస్తే.. సీఎం వైఎస్ జగన్‌తో పాటు పలువురు వైసీపీ మంత్రులు, ముఖ్యంగా నిర్మాత కమ్ పొలిటిషయన్ పీవీపీతో దిల్‌రాజుకు మంచి సాన్నిహిత్యం ఉంది. ఇదే క్రమంలో దిల్‌రాజు టీటీడీ పాలకమండలి సభ్యుడిగా అవకాశం కల్పించాలని వైఎస్ జగన్ వద్ద, వైవీ సుబ్బారెడ్డి వద్ద కూడా అప్లికేషన్ పెట్టుకున్నారట.
అంతేకాదు తన మిత్రుడైన పీవీపీతో కూడా రెకమెండేషన్ పెట్టించారట. ఇవన్నీ ఒక ఎత్తయితే సీఎం కేసీఆర్‌కు దిల్ అంటే అమితమైన అభిమానం.. దీన్ని చూసైనా తనకు అవకాశం కల్పిస్తారని భావించారు. అయితే.. బుధవారం నాడు ప్రకటించిన టీటీడీ సభ్యుల జాబితాలో తనపేరు రాకపోవడంతో దిల్‌రాజు తీవ్ర అసంతృప్తి లోనయ్యారట. అయితే ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకతో పాటు ఢిల్లీకి చెందిన పలువురికి టీటీడీ పాలకమండలిలో చోటు దక్కింది కానీ దిల్‌కు మాత్రం దొరకలేదు. ఈ వ్యవహారంపై దిల్ ఎలా రియాక్ట్ అవుతారో మరి.