Advertisement
Google Ads BL

బన్నీ-సుక్కు మూవీలో రష్మిక పాత్ర లీక్!


టాలీవుడ్‌లో అతి తక్కువ కాలంలోనే ఓ రేంజ్‌కు ఎదిగిపోయిన నటీమణుల్లో రష్మిక మందన్నా ఒక్కరని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఆమె నటన తెలుగు రాష్ట్రాల్లో సినీ ప్రియులకు అంతగా నచ్చేసింది.. ఆమె క్యూట్‌ అందాలు కుర్రకారుకు గిలిగింతలు పెట్టేశాయి. అందుకే రష్మిక సినిమా అంటే థియేటర్లకు యూత్ క్యూ కడుతుంటారు. ఈ మధ్య ఈ భామ నటించిన ఒకట్రెండు సినిమాలు ఆశించినంతగా ఆడలేదు కానీ.. మిగిలినవన్నీ వేలెత్తి చూపించనక్కర్లేదు. అందుకే ఈ ముద్దుగుమ్మకు స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు దక్కుతున్నాయ్.

Advertisement
CJ Advs

‘సరిలేరు నీకెవ్వరు’ లో సూపర్‌స్టార్ మహేశ్ బాబు సరసన నటిస్తున్న ఈ బ్యూటీ... తర్వాత స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్- సుకుమార్ కాంబోలో వస్తున్న మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో ‘రంగస్థలం’లో సమంత పాత్ర తరహాలోనే.. రష్మికకు ఓ మంచి కిక్కెంచే కథను రాశారట. అంటే రష్మిక పక్కా పల్లెటూరి పిల్లగా మారిపోనుందన్న మాట. ఆ రోల్ మాస్, క్లాస్ అందర్నీ మెప్పిస్తుందట. ఈ విషయం సుక్కు రెండోసారి కథలో మార్పులు చేర్పులు జరిపినప్పుడు తెలిసింది. అయితే ఈ లీక్స్‌లో ఎంతవరకు నిజముందో తెలియాలంటే సినిమా పట్టాలెక్కేవరకు వేచి చూడాల్సిందే మరి.

Bunny-Sukku Combo.. Rashmika Role leaked!:

Bunny-Sukku Combo.. Rashmika Role leaked!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs