Advertisement
Google Ads BL

‘చిరు’ బయోపిక్‌లో చెర్రీ చేయకపోతే.. నేనే!


టాలీవుడ్‌లో ప్రస్తుతం మల్టీస్టారర్ మూవీస్.. బయోపిక్‌ల ట్రెండ్ బాగా నడుస్తోంది. ఇప్పటికే రాజకీయాలు.. సినిమాల్లో ఓ వెలుగు వెలిగిన పలువురు ప్రముఖుల బయోపిక్‌లు వచ్చాయి. వాటిలో కొన్ని సూపర్ డూపర్ హిట్టవ్వగా.. మరికొన్ని అట్టర్ ప్లాప్ అయ్యాయి. వాటిగురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.. అవన్నీ ఇక్కడ అప్రస్తుతం కూడా.

Advertisement
CJ Advs

ఇక అసలు విషయానికొస్తే.. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి బయోపిక్ విషయమై చాలా ఏళ్ల నుంచే చర్చ జరుగుతోంది. కొందరేమో ఆయన బయోపిక్ వద్దని.. మరికొందరు తెరకెక్కించాల్సిందేనని కొందరు దర్శకులు సైతం ముందుకొచ్చారు. ఇదంతా ఒకప్పుడు.. తాజాగా మరోసారి ఈ బయోపిక్ వ్యవహారం తెరపైకి వచ్చింది. ‘వాల్మీకి’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా వరుణ్ తేజ్ .. దీని గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

చిరంజీవి గారి బయోపిక్‌ తీస్తే మీరు చేస్తారా..? అనే ప్రశ్న ఎదురవ్వగా ఇందుకు బదుదలిస్తూ.. ‘హరీష్‌ ఈ మధ్య ఒకసారి చిరంజీవి గారి బయోపిక్‌ తీస్తాను అని అన్నారు. అయితే ఆ రోల్‌‌లో నా కన్నా అన్నయ్య రామ్‌చరణ్‌ చేస్తే చాలా బాగుంటుంది. ఒక వేళ ఆయన చేయకపోతే సెకండ్‌ ఛాయిన్ మాత్రం నేనే. తప్పకుండా చేస్తాను. ఎట్టి పరిస్థితిల్లోనూ వదలుకోను.. వదులుకునే ప్రసక్తే లేదు’ అని తన మనసులోని మాటను వరుణ్ బయటపెట్టాడు. అయితే ఈ బయోపిక్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో వేచి చూడాల్సిందే మరి.

News About Megastar Chiru Biopic!:

News About Megastar Chiru Biopic!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs