Advertisement
Google Ads BL

అల్లు రామాయణంలో ప్రభాస్.. పాత్ర ఇదేనా!?


టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ భారీ బడ్జెట్‌తో ‘రామాయణం’ నిర్మించబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని నితేష్‌ తివారీ (దంగల్‌ ఫేం), రవి ఉద్యవర్‌ (మామ్‌ ఫేం) తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో ఎవరెవర్ని తీసుకోవాలి..? అని పాత్రదారులను వెతికే పనిలో దర్శకనిర్మాతలు బిజిబిజీగా ఉన్నారు. ముఖ్యంగా రాముడు, రావడుణు పాత్రలో ఎవరెవర్ని తీసుకోవాలనే దానిపై ప్రస్తుతం నిర్మాతలు యోచిస్తున్నారు. అయితే.. తాజాగా ఇందుకు ఓ వార్త వైరల్‌గా మారింది.

Advertisement
CJ Advs

అల్లువారి రామాయణంకు రాముడు, సీత, రావణుడు దొరికేశారన్నదే ఆ వార్త సారాంశం. ఈ చిత్రంలో హృతిక్ - దీపిక జోడీ శ్రీరాముడు- సీతాదేవిగా నటిస్తున్నారని ఇప్పటికే పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. తాజాగా ఈ వ్యవహారంపై నితేష్‌ తివారీ స్పందిస్తూ అబ్బే.. అదేంలేదే అంటూ పుకార్లకు ఫుల్‌స్టాప్ పెట్టారు. అయితే ఇప్పటికే హృతిక్, దీపిక పదుకొణే, టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ వంటి స్టార్లకు సిగ్నల్స్ వెళ్లిపోయాయట.

వీరిలో హృతిక్ - దీపిక జోడీ.. శ్రీరాముడు- సీతాదేవిగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ మాత్రం అత్యంత కీలకమైన రావణాసురుడి పాత్రలో నటిస్తే బావుంటుందని దర్శకనిర్మాతలు భావిస్తున్నారని టాక్. ప్రస్తుతం బాలీవుడ్‌ వరకే నటీనటులను తీసుకుంటున్న దర్శకనిర్మాతలు.. టాలీవుడ్‌ వైపు రాలేదు. త్వరలోనే ఈ విషయమై ప్రభాస్‌ను సంప్రదించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ భారీ సినిమాకు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా..? లేకుంటే నెగిటివ్ రోల్ కాబట్టి చేయనని సింపుల్‌గా ఒక్కమాటతో తేల్చేస్తారా? అన్నది తెలియాలంటే కొద్దిరోజులు వేచి చూడాల్సిందే మరి.

Prabhas Role in Allu Aravind Ramayanam Movie:

Allu Aravind Ramayanam Movie: Waiting for Prabhas Acceptance
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs