మన టాలీవుడ్ నుండి ఒకేసారి రెండు పాన్ ఇండియా మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. అందులో ఒకటి రీసెంట్ గా రిలీజ్ నెగటివ్ టాక్ తో పక్కకు తప్పుకుంది. దాదాపు 350 కోట్లు బడ్జెట్ తో తెరకెక్కించిన సాహో చిత్రంకి ఒక్క హిందీ వర్షన్ లో తప్ప మిగిలిన అన్ని భాషల్లో నష్టాలు చవి చూడటం ఖాయమని తేలిపోయింది. ఓవరాల్ రన్ లో ఎంత లాస్ అనేది తెలియనుంది. సాహో ఫెయిల్ అవ్వడంతో దాని ప్రవాభం సైరా పై పడింది.
సైరా కూడా 5 భాషల్లో రిలీజ్ అవుతుంది. కానీ సైరా టీం నుండి మాత్రం ఎటువంటి జోష్ కనిపించడంలేదు. రీసెంట్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ తో పాటు ట్రైలర్ డేట్ ప్రకటించినా ఆశించిన జోష్ బయట కనిపించడం లేదు. దానికి కారణం సాహో రిజల్ట్ అని కొందరు విశ్లేషిస్తున్నారు. రిలీజ్ ఇంకా రెండు వారలు మాత్రమే ఉన్న ఏ మాత్రం దూకుడుగా లేదు.
అసలే సైరా పై చాలామంది హోప్స్ పెట్టుకున్నారు. ముఖ్యంగా ఈ సినిమాని కొన్న బయ్యర్లు సైరా మీద చాలా నమ్మకం పెట్టుకున్నారు. సాహో పరిస్థితి సైరాకి రాకూడదని ఫ్యాన్స్ తో పాటు సినిమాకి కొన్న బయ్యర్స్ కోరుకుంటున్నారు.