Advertisement
Google Ads BL

ఈ చిత్రాన్ని విజయనిర్మలకి అంకితమిస్తున్నారు


‘ఊరంతా అనుకుంటున్నారు’ కచ్చితంగా ‘శతమానం భవతి’ లాంటి గొప్పచిత్రం అవుతుంది: మామిడాల శ్రీనివాస్‌

Advertisement
CJ Advs

‘‘శతమానం భవతి లాంటి గొప్ప సినిమా తర్వాత ఫ్యామిలీ అంతా కలిసి చూసే ఆ స్థాయి సినిమా ఏదీ రాలేదు. అందుకే ఇంటిల్లిపాదికీ అలాంటి అద్భుతమైన అనుభూతి కలిగే సినిమాను అందించానే ఉద్దేశంతో ‘ఊరంతా అనుకుంటున్నారు’ అనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాం. ఇది కచ్చితంగా ‘శతమానం భవతి’ లాంటి గొప్ప సినిమా అవుతుంది’’ అంటున్నారు ప్రముఖ డిస్ట్రిబ్యూటర్‌ మామిడాల శ్రీనివాస్‌. బాలాజీ సాన దర్శకత్వంలో నవీన్‌ విజయ కృష్ణ, అవసరాల శ్రీనివాస్‌, మేఘా చౌదరి, సోఫియా సింగ్‌ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘ఊరంతా అనుకుంటున్నారు’. రోవాస్కైర్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై శ్రీహరి మంగళంపల్లి, రమ్య గోగుల, పి.ఎల్‌.ఎన్‌. రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అక్టోబర్‌ 5న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం థియేట్రికల్‌ రైట్స్‌ను శ్రీరాజేశ్వరి ఫిల్మ్స్‌ బ్యానర్‌, మూవీ మ్యాక్స్‌ అధినేత మామిడాల శ్రీనివాస్‌ దక్కించుకున్నారు.

ఈ సందర్భంగా మామిడాల శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. ‘‘నేను ‘అపరిచితుడు’, ‘శివపుత్రుడు’ తదితర 20 సినిమాలు డిస్ట్రిబ్యూషన్‌ చేశాను. అలాగే 4 సినిమాలు ప్రొడ్యూస్‌ చేశాను. ఆ అనుభవంతోనే ‘ఊరంతా అనుకుంటున్నారు’ సినిమా థియేట్రికల్‌ రైట్స్‌ కొన్నాను. ఆ సినిమా చూడగానే ‘శతమానం భవతి’లాంటి గొప్ప చిత్రం అవుతుందనిపించింది. తప్పకుండా ఈ సినిమా మంచి విజయం సాధిస్తుంది. మూవీమ్యాక్స్‌ ద్వారా ఈ చిత్రాన్ని అక్టోబర్‌ 5న ప్రేక్షకుల ముందుకు తీసురాబోతున్నాం. సీనియర్‌ యాక్టర్‌ నరేశ్‌ వాళ్ల అబ్బాయి నవీన్‌ విజయకృష్ణ ‘నందిని నర్సింగ్‌ హోమ్‌’ తర్వాత ఇలాంటి మంచి సినిమాలో నటించడం ఆనందంగా ఉంది. కోట శ్రీనివాసరావు, అవసరాల శ్రీనివాస్‌, జయసుధ, రావు రమేష్‌, అన్నపూర్ణమ్మ లాంటి పెద్దపెద్ద ఆర్టిస్టులు ఈ సినిమాకు పనిచేశారు. సినిమా చాలా బాగా వచ్చింది. తప్పకుండా ఇది అందరికీ నచ్చుతుంది. త్వరలోనే ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ నిర్వహించబోతున్నాం. ఒక స్టార్‌ హీరో గెస్ట్‌గా రాబోతున్నారు. ప్రముఖ హీరోతో సినిమాకు వాయిస్‌ ఓవర్‌ ఇప్పించబోతున్నాం. ఈ సినిమా వెనుక సూపర్‌స్టార్‌ కృష్ణ, విజయనిర్మలగారి సపోర్ట్‌ ఎంతో ఉంది. ఈ చిత్రాన్ని విజయనిర్మలగారికి అంకితం ఇస్తున్నాం’’ అని చెప్పారు.

Mamidala Srinivas About Ooranta Anukuntunnaru:

Ooranta Anukuntunnaru Movie Latest Update
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs