Advertisement
Google Ads BL

లగ్జరీ కార్లతో పూరీ-ఛార్మీ ఫుల్ ఎంజాయ్!


టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్.. నటి కమ్ నిర్మాత ఛార్మీ ఇద్దరూ మంచి ఆప్తులన్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరి జోడీ ఇప్పట్నుంచి కాదు ఎప్పట్నుంచో హాట్ టాపిక్ అయ్యింది.. ఎన్నో రూమర్స్ వచ్చాయ్.. అయినప్పటికీ ‘మేమింతే’ అన్నట్లుగా ముందుకెళ్తున్నారు.. అవన్నీ ఇప్పుడు అప్రస్తుతం, అసందర్భం కూడా.

Advertisement
CJ Advs

రామ్ పోతినేని హీరోగా పూరీ-ఛార్మీ జోడీగా తెరకెక్కించిన ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రం ఏ రేంజ్‌లో సూపర్ డూపర్ హిట్టయ్యిందో.. అంతకుమించి కలెక్షన్ల వర్షం కురిపించింది. దీంతో ఈ జోడీ మంచి కిక్కుమీద ఉంది. ఇదే కిక్కుతో ముందుకెళ్లాలని భావిస్తున్న వీరు ఇక మనరేంజ్ పెంచుకోవాలంటూ స్టార్ హీరోలను లైన్‌లో పెట్టే పనిలో బిజీబిజీ అయ్యారు.

ఉన్నట్టుండి ఈ జోడీ భారీ లగ్జరీ కార్లతో ప్రత్యక్షమై షాకిచ్చింది. పూరి రేంజ్ రోవర్ తెలుపు కారు, బీఎండబ్ల్యూ 7 సిరీస్ కార్‌ని ఛార్మీ కొన్నారు. ఇదిగో మేం కార్లు కొన్నాం అని తెలియాలి కదా అని ఆ కార్ల దగ్గర నిలబడి రెండో ఫొటోలకు ఫోజులిచ్చారు. అంతేకాదు.. ఈ రెండు కార్లు తెలంగాణ నంబర్ ప్లేట్‌తో రెడీ అయిపోయాయ్. ఇదిగోండి మా కొత్త కార్లు అంటూ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. కాగా.. ఈ కార్లు రెండూ కలిపి సుమారు రెండు నుంచి మూడు కోట్ల వరకు ఉండొచ్చోమో. ప్రస్తుతం ఈ జోడీ.. విజయ్ దేవరకొండతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

Puri-Charmi Jodi Enjoys With Costly Cars!:

Puri-Charmi Jodi Enjoys With Costly Cars!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs