మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ ‘సైరా’ తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో అక్టోబర్-02 న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ప్రమోషన్స్ కూడా అదే రేంజ్‌లో చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. ఇప్పటికే ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఈ నెల-18న అనగా.. బుధవారం నాడు నిర్వహిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే సడన్‌గా ఏం జరిగిందో ఏమోగానీ మళ్లీ వాయిదా పడింది. 18 నుంచి 22కు మారుస్తున్నట్లు ‘అఖిలభారత చిరంజీవి యువత’ ఓ ప్రకటనలో తెలిపింది.
అయితే.. ఇంతవరకూ ఈ మార్పుపై దర్శకనిర్మాతలు మీడియాకు సమాచారం ఇవ్వడం కానీ.. కనీసం సోషల్ మీడియా వేదికగా కూడా స్పందించలేదు. దీంతో అసలు ఇందులో నిజమెంత..? నిజంగానే పోస్ట్ పోన్ అయ్యిందా..? ఒక వేళ అయ్యుంటే అధికారికంగా ఎందుకు ప్రకటన రాలేదు..? అని మెగాభిమానులు, సినీ ప్రియులు ఆందోళనలో పడ్డారు. మరి ఈ వ్యవహారంపై దర్శకనిర్మాతలు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి.
ఇదిలా ఉంటే.. ఈ మహోత్తర వేడుకకు ప్రత్యేక అతిథులుగా తెలంగాణ మంత్రి కేటీఆర్, జనసేన అధినేత పవన్ కల్యాణ్, దర్శధీరుడు రాజమౌళి, శివ కొరటాల, వీవీ వినాయక్ హాజరవుతున్నట్లు చిత్రబృందం ఇదివరకే ప్రకటించింది.