పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య.. ఒకప్పటి హీరోయిన్ రేణూదేశాయ్ ఓ ఆసక్తికర విషయాన్ని చెప్పి.. అందరూ జాగ్రత్తగా ఉండండి అంటూ సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో పంచుకుంది. రేణూ ప్రస్తుతం డెంగీ వ్యాధితో బాధపడుతోంది. ఇప్పుడిప్పుడే తాను కోలుకుంటున్నానని.. అలాగే షూటింగ్‌కు కూడా వెళ్ళానని చెప్పుకొచ్చింది. కాగా.. ఈటీవీలో వచ్చే ‘ఢీ ఛాంపియన్’ షో 12వ సీజన్ కోసం ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది.
తాను డెంగీతో బాధపడుతున్నప్పటికీ షూటింగ్‌ను కాదనలేక వెళ్లాల్సి వచ్చిందని.. అందరూ దోమలతో జాగ్రత్తగా ఉండాలని ఆమె పిలుపునిచ్చింది. అంతేకాదు.. మీ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోండి.. అలాగే పొట్టి దుస్తులు కాకుండా పొడవైన దుస్తులనే ధరించండని సలహా ఇచ్చింది. కాగా.. ఈ మాటలను చెప్పిన రేణూ తాను షూటింగ్‌లో ఉన్న పిక్‌ను అభిమానులతో పంచుకుంది. ఈ పోస్ట్ చూసిన పవన్ అభిమానులు, పలువురు జనసేన కార్యకర్తలు ‘జాగ్రత్త మేడం’ అంటూ రిప్లైలు ఇస్తున్నారు.