Advertisement
Google Ads BL

ఈ సినిమా చేసింది నేనేనా!: సందీప్ కిషన్


బిగినింగ్ నుండి ఎండింగ్ వరకు నవ్వుతూ..  ఎంజాయ్ చేస్తారు.. టీజర్ లాంచ్‌లో హీరో సందీప్ కిషన్  

Advertisement
CJ Advs

‘నిను వీడని నీడను నేనే’ వంటి డీసెంట్ హిట్ తర్వాత సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘తెనాలి రామకృష్ణ బి.ఏ,బి.ఎల్’. హన్సిక మోత్వానీ హీరోయిన్‌గా వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్యపాత్రలో నటించింది. శ్రీ నీలకంఠేశ్వర స్వామి క్రియేషన్స్ పతాకంపై రామాంజనేయులు సమర్పణలో జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో నవ నిర్మాతలు అగ్రహారం నాగిరెడ్డి, సంజీవరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం టీజర్ రిలీజ్ వేడుక హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది. ఈ సమావేశంలో హీరో సందీప్ కిషన్, హీరోయిన్ హన్సిక మోత్వానీ, దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి, నటులు అనంత్, అశోక్ కుమార్, గిరిధర్, సంగీత దర్శకుడు సాయి కార్తీక్, ఎడిటర్ చోటా కె.ప్రసాద్, మాటల రచయితలు భవానీ ప్రసాద్, నివాస్, ఎగ్జికూటివ్ ప్రొడ్యూసర్ సీతారామరాజు మల్లెల, సహా- నిర్మాతలు రూపా జగదీశ్, ఇందుమూరి శ్రీనివాసులు, చిత్ర నిర్మాతలు అగ్రహారం నాగిరెడ్డి, సంజీవరెడ్డి పాల్గొన్నారు.. అనంతరం సందీప్ కిషన్, హన్సిక సంయుక్తంగా తెనాలి రామకృష్ణ టీజర్‌ను రిలీజ్ చేసారు. 

నేను బాగా ఎంజాయ్ చేస్తూ చేసిన సినిమా ఇది!!

హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ.. నాగేశ్వరరెడ్డి మీద వున్న నమ్మకంతో అతని స్నేహితులు ఈ చిత్రాన్ని నిర్మించినందుకు వారికి నా థాంక్స్. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా చేశాను. ఫస్ట్ టైం సిన్సియర్ గా నా పనిని హండ్రెడ్ పర్సెంట్ ఎంజాయ్ చేస్తూ వర్క్ చేశాను. ఈ క్రెడిట్ అంతా దర్శకుడు నాగేశ్వరరెడ్డిదే. ఈ సినిమాకి ఆయన దొరకడం నా అదృష్టం. ఎమోషన్స్ తో పాటు పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సినిమా బిగినింగ్ నుండి ఎండింగ్ వరకు నవ్వుతూనే వుంటారు. కొత్త ఎంటర్టైనర్ మూవీని చూస్తారు ప్రేక్షకులు. అన్నీ తానై నాగేశ్వర్ రెడ్డి ఈ సినిమా చేసారు. రాజసింహ మంచి కథ ఇచ్చాడు. వెరీ టాలెంటెడ్ రైటర్. సాయి కార్తీక్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఆర్ ఆర్ ఇరగదీసాడు. ఈ సినిమాలో నన్ను చాలా కొత్తగా ప్రెజెంట్ చేసారు దర్శకుడు. నాకు నేనే చాలా కొత్తగా కనిపించాను. ఈ సినిమా నేనేనా చేసింది అనిపించింది. హన్సికతో వర్క్ చేయడం అమేజింగ్ గా అనిపించింది. సెట్లో ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది తను. తెనాలి రామకృష్ణ బి.ఏ,బి.యల్ సినిమా అందరూ ఎంజాయ్ చేసే విధంగా ఉంటుంది.. అన్నారు. 

హీరోయిన్ హన్సిక మోత్వానీ మాట్లాడుతూ.. నాగేశ్వరరెడ్డితో ఇది రెండవ సినిమా. ఇట్స్ ఎ ఫుల్ ఎంటర్టైన్మెంట్స్ మూవీ. ఫ్యామిలీస్ తో పాటు యూత్ అందరు ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాలో నేను ఒక భాగమైనందుకు చాలా హ్యాపీగా వుంది..అన్నారు. 

నా స్నేహితులకి నేను ఇచ్చే గిఫ్ట్ ఈ సినిమా!!

దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. టీజర్ ని మేమంతా చాలా సార్లు చూసుకున్నాం. మాకు బాగా నచ్చింది. కానీ చోటా కె.నాయుడు గారు సడన్ సర్ప్రైజ్‌తో వేదిక మీదకు వచ్చి మా టీజర్ అదిరిపోయింది, సూపర్బ్‌గా వుంది అని చెప్పడం చాలా హ్యాపీగా వుంది. ఆయన మాటలు ఒక ఎనర్జీ నిచ్చాయి. ఇదే స్పూర్తితో ఇంకా ముందుకు వెళ్తాము. దేనికైనా రెడీ సినిమా తర్వాత హన్సికతో చాలా సినిమాలు చేయాలనుకున్నాను. అంత సపోర్టివ్ గా వర్క్ చేస్తుంది. రాజసింహ మంచి పాయింట్ ఇచ్చాడు. దానిని మా రైటర్స్ అందరు బాగా డెవలప్ చేసి మంచి స్క్రిప్ట్ తయారు చేశాం. మా నిర్మాతలందరూ నాకు ఎంతో హెల్ప్ చేసారు. వారికి మంచి సినిమా చెయ్యాలని ఈ సినిమా చేసి గిఫ్టుగా ఇస్తున్నాను. సినిమా చాలా బాగా వచ్చింది. మా టీమ్ అంతా చాలా కాన్ఫిడెంట్ గా వున్నాం.. అన్నారు. 

నిర్మాత అగ్రహారం నాగిరెడ్డి మాట్లాడుతూ..  చిన్నప్పటినుండి మేము ఫ్రెండ్స్. అందరం కలిసి ఈ సినిమా చేశాం. మా మిత్రుడు నాగేశ్వరరెడ్డి వన్ ఇయర్ బ్యాక్ సినిమా చేద్దాం అన్నాడు. అలా మంచి కథ కుదరడంతో వెంటనే ఈ సినిమా చేశాం. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆశీర్వదించి పెద్ద సక్సెస్ చెయ్యాలని కోరుకుంటున్నాను.. అన్నారు. 

మరో నిర్మాత సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ చిత్రంలో నటించిన నటీనటులు సాంకేతిక నిపుణులు అందరికీ మా థాంక్స్. మేము మా పనుల్లో వుండి షూటింగ్ కి రాకపోయినా మా దర్శకుడు నాగేశ్వరరెడ్డే వన్ మ్యాన్ ఆర్మీ గా అన్నీ చూసుకొని సకాలంలో ఈ చిత్రాన్ని పూర్తిచేశారు. ఒక మంచి చిత్రాన్ని మాకు ఇచ్చారు.. అన్నారు. 

సంగీత దర్శకుడు సాయి కార్తీక్ మాట్లాడుతూ.. ఇది నాకు 75వ సినిమా. ఇన్ని సినిమాలు చేయడానికి అవకాశం ఇచ్చిన హీరోలకు, నిర్మాత, దర్శకులకు నా కృతజ్ఞతలు. నాగేశ్వరరెడ్డి గారితో ఈడో రకం ఆడోరకం చేశాను. మళ్ళీ ఈ సినిమా చేశాను. సినిమా బాగా వచ్చింది. డెఫినెట్‌గా పెద్దహిట్ అవుతుంది.. అన్నారు. 

ఈ సినిమాలో చాలా మంచి పాత్రలు పోషించాం. కడుపుబ్బా నవ్వుకునేలా కామిడీ ఉంటుంది. తప్పకుండా ఈ చిత్రం సూపర్ హిట్ అవుతుంది అని నటులు అనంత్, అశోక్ కుమార్, గిరిధర్ తమ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. 

సందీప్ కిషన్, హన్సిక మోత్వానీ జంటగా నటించిన ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్, మురళీశర్మ, అయ్యప్పశర్మ, రఘు బాబు, పోసాని కృష్ణమురళి, సప్తగిరి, వెన్నెల కిషోర్, ప్రభాస్ శ్రీను, చమ్మక్ చంద్ర, బెనర్జీ, అనంత్, కాదంబరి కిరణ్, ప్రదీప్, అన్నపూర్ణ, వై.విజయ, రజిత, మణిచందన, సత్యకృష్ణ, కిన్నెర, శ్రీసుధ, తదితరులు నటించారు. 

ఈ చిత్రానికి కథ: టి.రాజసింహ, మాటలు: భవాని ప్రసాద్, నివాస్, సంగీతం: సాయి కార్తీక్, డీఓపీ: సాయి శ్రీరామ్, ఆర్ట్స్: కిరణ్, ఎడిటింగ్: చోట కె.ప్రసాద్, యాక్షన్: వెంకట్. డాన్స్: శోభి, ప్రేమ్ రక్షిత్, పాటలు: భాస్కరభట్ల, చిలకరెక్క గణేష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సీతారామరాజు మల్లెల, సహా-నిర్మాతలు: రూపా జగదీశ్, ఇందుమూరి శ్రీనివాసులు, నిర్మాతలు: అగ్రహారం నాగిరెడ్డి, సంజీవరెడ్డి, స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: జి.నాగేశ్వరరెడ్డి. 

Tenali Ramakrishna BABL Movie Teaser Released :

Tenali Ramakrishna BABL Movie Teaser Release Event Highlights
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs