Advertisement
Google Ads BL

అఖిల్‌కు హీరోయిన్‌ను సెట్ చేశారు


అఖిల్ అక్కినేని, బొమ్మ‌రిల్లు భాస్క‌ర్‌, బ‌న్నివాసు చిత్రం లో హీరోయిన్ గా పూజా హెగ్డే.

Advertisement
CJ Advs

అఖిల్ అక్కినేని హీరోగా మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై ప్రోడ‌క్ష‌న్ నెం 5 గా బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం లో నిర్మాత‌లు బ‌న్నీవాసు, వాసు వ‌ర్మ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్తం కోసం హీరోయిన్ ను ఫైనల్ చేశారు. డి.జె, అరవింద సమేత, మహర్షి వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో హీరోయిన్ గా అందం, అభినయంతో ఆకట్టుకున్న పూజాహెగ్డేను హీరోయిన్ గా ఖరారు చేసినట్టు చిత్రం యూనిట్ ప్రకటించారు. అఖిల్, పూజా హెగ్డే జోడీకి మంచి పేరు వస్తుందని... దర్శక నిర్మాతలు ధీమా వ్యక్తం చేశారు.

అక్కినేని నాగేశ్వ‌రావు గారి, అక్కినేని నాగార్జున గారి న‌ట వార‌సుడుగా ప‌రిచ‌య‌మైన అఖిల్ అక్కినేని తన సినిమాల ద్వారా ఒక ప్రత్యేకమైన క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు. త‌ను చేసిన హ‌లో, మిస్ట‌ర్ మజ్ను లాంటి ల‌వ్ కమ్ ఫ్యామిలి ఎంట‌ర్‌టైన‌ర్స్ తో అక్కినేని అభిమానుల‌నే కాకుండా ఫ్యామిలి అండ్ గ‌ర్ల్స్ సెక్టార్ లో అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు.

బొమ్మ‌రిల్లు చిత్రం ఇప్ప‌టికి ట్రెండ్ సెట్ట‌ర్ ఇన్ ల‌వ్ అండ్ ఫ్యామిలి ఎంట‌ర్‌టైన‌ర్ గా నిలిచిపోయిందంటే అది కేవ‌లం ద‌ర్శ‌కుడు భాస్క‌ర్ విజ‌న్ అండ్ వాల్యూస్ అని చెప్పాలి. ఆ త‌రువాత వ‌చ్చిన ప‌రుగు చిత్రం ప్ర‌తి ఒక్క‌రిని ఆలోచింప‌చేసేలా అద్బుతంగా తీర్చిదిద్దాడు. ఫ్యామిలీ ఆడియ‌న్స్ లో భాస్క‌ర్ ది సప‌రేటు ఇమేజ్ వుంది. ఇప్పుడు వీర‌ద్దిరి కాంబినేష‌న్ లో చిత్రం అన‌గానే ఈ క్రేజ్ మ‌రింత పెరిగింది.

గ‌తంలో గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ లో మెగా హీరోలు కాకుండా చేసిన చిత్రం 100% ల‌వ్‌.. ఈ చిత్రంలో అక్కినేని న‌ట వార‌సుడు నాగ చైత‌న్య హీరోగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో బ‌న్ని వాసు నిర్మించాడు. ఆ చిత్రం చాలా మంచి విజ‌యాన్ని సాధించ‌టం విశేషం.. మళ్ళీ ఇప్పుడు అక్కినేని వారి మ‌రో న‌ట వార‌సుడు అఖిల్ అక్కినేని హీరోగా నిర్మాత‌లు బ‌న్ని వాసు, వాసు వ‌ర్మలు నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని బొమ్మ‌రిల్లు, ప‌రుగు లాంటి ట్రెండ్ సెట్ ఫ్యామిలి ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రాలకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం చేస్తున్నారు. ఈ చిత్రం కూడా 100% ల‌వ్ కి డ‌బుల్ హిట్ ని సాధిస్తుంద‌ని యూనిట్ లో కాన్ఫిడెన్స్ వుండ‌టం విశేషం.

అల్లు అర‌వింద్ గారు-జిఏ2 పిక్చ‌ర్స్‌- బ‌న్నివాసు-వాసువ‌ర్మ కాంబినేష‌న్‌

మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ గారి స‌మ‌ర్స‌ణలో బ‌న్ని వాసు ప్రొడ్యూస‌ర్ గా 100% ల‌వ్ నుండి పిల్లా నువ్వులేని జీవితం, గీత గోవిందం వ‌ర‌కూ వ‌ర‌స బ్లాక్‌బ‌స్ట‌ర్ విజ‌యాలు సొంతం చేసుకున్నారు. సెలెక్టెడ్ స్క్రీప్ట్ ల‌తో అప్‌డేటెడ్ గా అల్లు అర‌వింద్ గారి స‌ల‌హాలు సూచ‌న‌ల‌తో బ‌న్ని వాసు యువ నిర్మాతగా సక్సెస్ రేట్ ఎక్కువుగా వున్న నిర్మాతల్లో ఒక‌డిగా త‌న‌కంటూ  ప్రత్యేకతని ఏర్ప‌రుచుకున్నాడు. ఇప్పుడు ఈ చిత్ర క‌థ న‌చ్చిన మ‌రో యంగ్ ద‌ర్శ‌కుడు వాసు వ‌ర్మ మెట్ట‌మెద‌టిసారిగా నిర్మాణ రంగంలోకి బ‌న్నివాసుతో క‌లిసి యంగ్ డైన‌మిక్ అఖిల్ అక్కినేనితో బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు, మ‌రియు షూటింగ్ షెడ్యూల్స్ వివ‌రాలు త్వ‌ర‌లో తెలియ‌జేస్తాం అని నిర్మాత‌లు తెలిపారు..

అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌

కెమెరా- వి.మ‌ణికంద‌న్‌

సంగీతం- గోపిసుంద‌ర్‌

ఎడిటింగ్‌- మార్తాండ్‌.కె.వెంక‌టేష్‌

నిర్మాత‌లు.. బ‌న్ని వాసు, వాసు వ‌ర్మ‌

క‌థ‌, స్క్నీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం- భాస్క‌ర్‌

Heroine Fixed for Akhil and Bommarillu Bhaskar Film:

Pooja Hegde Selected for Akhil Next Film
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs