హాట్ యాంకర్‌ను గాడిదతో పోల్చిన నాగ్!


అవును మీరు వింటున్నది నిజమే.. అక్కినేని నాగార్జున ఓ ప్రముఖ లేడీ యాంకర్‌పై తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయి గాడిదతో పోల్చారు. అసలు నాగ్ ఎందుకింత ఆగ్రహానికి లోనయ్యారు..? ఇంతకీ ఆ లేడీ యాంకర్ ఎవరు..? అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 

తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్‌ షో.. ముగింపు ఎపిసోడ్‌లు దగ్గరపడుతుండటంతో హాట్ హాట్‌గా మారుతోంది. ప్రతిరోజూ ఎంట్రీతోనే మాంచి ఊపు ఉన్న సాంగ్‌తో ఎగురుకుంటూ వచ్చే నాగ్.. అన్నీ రద్దు చేసుకుని వచ్చి ‘నాకు మండిపోతుంది.. కంటెస్టెంట్స్‌పై పీకలదాకా కోపం ఉంది.. వెంటనే బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లాలి’ అంటూ వచ్చి.. మహేష్, శ్రీముఖి, పునర్నవిలకు గట్టిగా క్లాస్ పీకారు.

శ్రీముఖిపై కట్టలు తెంచుకునే ఆగ్రహంతో ఉన్న నాగ్.. ఆ హాట్ యాంకర్‌ను గాడిదతో పోలుస్తూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల జరిగిన ఎపిసోడ్‌లో శ్రీముఖి.. హౌస్‌మేట్స్‌ను తప్పుదారి పట్టించిన విధానాన్ని పాయింట్ చేసి.. ‘శ్రీముఖి.. నీ ఆట ఎలా ఉందో తెలుసా? కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెడగొట్టినట్టు ఉంది. నువ్ బిగ్ బాస్ హౌస్‌కి కెప్టెన్‌వి కాదు.. బిగ్‌బాసే అందరికీ బాస్.. నీ ఆట నువ్ ఆడుకో’ అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. దీంతో కంగుతిన్న శ్రీముఖి.. చేసేదేమీ లేక తలదించుకుని మిన్నకుండిపోయింది. అయితే ఇవాళ ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే మరి.

Nag Angry On Hot Anchor In Bigg Boss Show!:

Nag Angry On Hot Anchor In Bigg Boss Show!
Show comments


LATEST TELUGU NEWS


LATEST IN NEWS

POPULAR NEWS



LATEST IN GALLERIES

POPULAR GALLERIES