Advertisement
Google Ads BL

‘మైగ్రేన్’ సమస్యతో బాధపడ్డ మహేశ్‌.. చివరికిలా!


టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు తన వీరాభిమానులతో ప్రతి చిన్న విషయాన్ని కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తుంటారు. అందుకే ఆయనకు రోజురోజుకూ అభిమానుల సంఖ్య పెరుగుతుందే తప్ప.. తగ్గట్లేదు.. అలా సూపర్‌స్టార్‌ స్థాయికి ఎదిగిపోయారు. అన్ని విషయాలు షేర్ చేసుకునే మహేశ్.. ఓ రహస్యాన్ని మాత్రం బయటపెట్టడానికి ఇష్టపడలేదు.. ఇటీవల తనకున్న ఓ ఆరోగ్య సమస్యను బయటపెట్టారు.. ఇది విన్న అభిమానులు ఒకింత షాక్‌కు లోనయ్యారు.

Advertisement
CJ Advs

చాలా ఏళ్లుగా తాను మైగ్రేన్‌ వ్యాధితో బాధపడ్డానని.. ఇది నివారణయ్యే చాన్స్ లేదని చాలా మంది చెప్పారన్నారు. దీని భారీ నుంచి బయటపడటానికి చాలామంది డాక్టర్లను, రకరకాల మందులు తిన్నప్పటికీ తగ్గలేదన్నారు. అలా పెయిన్ కిల్లర్స్‌కు అలవాటు పడిన తాను.. ఒక్కోసారి 6-7 గంటల పాటు తలనొప్పితో బాధపడేవాడినని చెప్పుకొచ్చారు. 

ఇలా తాను బాధపడుతున్న సమయంలో నమ్రత ఓ స్నేహితురాలి ద్వారా డాక్టర్ సత్య సింధూజను కలిసి వైద్యం చేయించిందని.. దీంతో మైగ్రేన్ తలనొప్పి మటుమాయం అయిందన్నారు. ఆ వైద్యం పేరు ‘చక్రసిద్ధ నాడీ’ వైద్యం అని ఆయన తెలిపారు. అయితే.. తనలాగా మైగ్రేన్‌తో బాధపడుతున్న వాళ్ల కోసమే ఈ విషయం చెబుతున్నానన్నారు. తాను ప్రస్తుతం మైగ్రేన్ నుంచి పూర్తిగా కోలుకున్నానని ఎంతో.. ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నానని మహేశ్ చెప్పుకొచ్చారు.

Mahesh Babu speaks of his Migraine problem!:

Mahesh Babu speaks of his Migraine problem!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs