Advertisement
Google Ads BL

‘తేజ’ కొత్త సినిమా.. పాయల్‌కు బంపరాఫర్!


టాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్లలో ‘తేజ’ ఒకరు. ఈయన చేసిన సినిమాలే ఇందుకు నిదర్శనం.. ఇతను దర్శకత్వం వహించిన సినిమాలు బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే ఈ మధ్య ఆ పరిస్థితులు మొత్తం పోయాయ్. ఇప్పటి వరకూ దాదాపు అన్నీ లవ్ ట్రాక్‌తో సినీప్రియుల్లోకెళ్లిన తేజ.. ఈసారి లేడీ ఓరియెంటెడ్ సినిమాను తెరకెక్కించాలని భావిస్తున్నారట.

Advertisement
CJ Advs

అయితే ఈ సినిమా ఎవరితో తెరకెక్కిస్తే కలిసొస్తుందని ఆలోచిస్తున్నారట. ఒకరిద్దరి పేర్లు పరిశీలనలో ఉన్నప్పటికీ ఇంకా ఫైనల్ చేయలేదట. ఇందుకు సంబంధించి ఎలాంటి లీకులు రాలేదు కానీ.. ఈ సినిమాలో మాత్రం ఆర్ఎక్స్-100 అందాల బ్యూటీ పాయల్‌ రాజ్‌పుత్‌కు బంపరాఫర్ ఇచ్చేశారట. అంటే ఈ సినిమాలో ఈమె హీరోయిన్ అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్లేనండోయ్.. కేవలం ఐటెం సాంగ్‌కు మాత్రమే పాయల్‌ను ఫిక్స్ చేశాడట తేజ.

కాగా.. తేజ తెరకెక్కించిన ‘సీత’ చిత్రంలో పాయల్ పాప.. ‘బులెట్ మీదొచ్చే బుల్రెడ్డి’ అనే ఐటెం సాంగ్‌లో నర్తించిన సంగతి తెలిసిందే. ఈ సాంగ్‌లో పాయల్ అంద చెందాలు, నటనకు తేజ ఫిదా అయ్యారట. అందుకే తన తదుపరి సినిమాలో ఈ హాట్ హాట్ భామకు చాన్స్ ఇచ్చి.. అందాలు ఆరబోయించాలని ఆయన ఫిక్స్ అయ్యారట. ఇందుకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రటకన రాలేదు. ఇదిలా ఉంటే.. పాయల్‌ పాప ప్రస్తుతం రవితేజ సరసన ‘డిస్కో రాజా’లో, వెంకటేష్ సరసన ‘వెంకీ మామ’.. ఆర్ఎక్స్-100 రేంజ్‌లో ‘ఆర్డీఎక్స్’లో నటించింది.. త్వరలోనే ఈ సినిమాలన్నీ రిలీజ్ కానున్నాయి.

Payal Rajput Get Bumper Offer In Director Teja New Movie!:

Payal Rajput Get Bumper Offer In Director Teja New Movie!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs