మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ ‘సైరా’ తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో అక్టోబర్ 2 న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ప్రమోషన్స్ కూడా అదే రేంజ్‌లో చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే.. అసలు సినిమాకు ఏది హైలైట్ కానుంది..? ఇప్పటి వరకూ చిరు లుక్ ఓకే.. సినిమా మొత్తం ఎలా ఉండబోతోంది..? అసలు సినిమాకు ప్లస్ పాయింట్స్ ఏంటి..? చిరు తర్వాత ఎవరి పాత్ర హైలైట్ కానుంది..? ఇంతకీ ఫస్టాప్ మెప్పిస్తుందా..? సెకండాఫ్ మెప్పిస్తుందా..? ఇలా మెగాభిమానులు, సినీ ప్రియుల్లో.. సినీ ఇండస్ట్రీలో చాలా ప్రశ్నలే మెదులుతున్నాయ్.
అయితే మెగాభిమానుల ప్రశ్నలకు సినిమా రిలీజ్ కాకమునుపే దాదాపు సమాధానాలు అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రస్తుతం సైరాలోని సూపర్ హైలైట్స్ ఇవేనంటూ వెబ్‌సైట్స్, టీవీ చానెల్స్, ప్రముఖ విశ్లేషకులు, సినీ ఇండస్ట్రీకి చాలా దగ్గరగా ఉండే పెద్దలు పుంకాలు పుంకాలుగా కథనాలు రాసేస్తున్నారు.
సైరా సూపర్ హైలైట్స్ ఇవే..!
- ‘సైరా’లో ఝాన్సీ లక్ష్మీభాయి పాత్రలో అనుష్క కనిపిస్తోంది. ఈమె వాయిస్‌తోనే సైరా కథ మొదలు కానుందట.
- సిరివెన్నెల రాసిన సైరా నరసింహారెడ్డి పాట ఐదు నిమిషాలకు పైగా ఉంటుందట
- సినిమా మొత్తానికి ‘వాటర్ ఫైట్’ హైలైట్ కానుందట. అంతేకాదండోయ్.. దీనికోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేశారట. ఈ ఫైట్ మిల్క్ బ్యూటీ తమన్నా-చిరు-విదేశీ ఫైటర్ల మధ్య జరుగుతుందట.
- ఫస్టాఫ్ మొత్తం నరసింహారెడ్డి జమీందారీ జీవితం.. సెకండాఫ్‌లో అసలు పోరాట గాథ ప్రారంభం కానుందట.
- సైరా సినిమా క్లైమాక్స్ ఎమోషనల్‌గా ఉంటుందట.
- ప్రీ క్లయిమాక్స్ ఫుల్ యాక్షన్‌తో ఉంటుంద. ఈ సీన్ల కోసం కోట్లాది రూపాయలు మంచినీళ్లలా ఖర్చయినట్టు తెలుస్తోంది.
- డైలాగ్స్ మాత్రం అదుర్స్ అనిపిస్తాయట. ఎమోషనల్‌గా డైలాగ్స్‌తో సాగే ఈ సన్నివేశాలు మనసుని హత్తుకునేలా ఉంటాయట. కొన్ని సన్నివేశాల్లో చిరు చెప్పే డైలాగ్స్ అభిమానులు బాగా కనెక్టవుతాయని టాక్.
- సినిమా సెకాండాఫ్‌లో వచ్చే జాతర పాట మెగా మాస్ అభిమానులను ఆగకుండా ఈలలు వేయిస్తుందట.
అయితే పైన చెప్పిన విషయాలు అక్షరాలా నిజమవుతాయా..? లేదా..? అనేది తెలియాలంటే సైరా థియేటర్లలోకి వచ్చి ఫస్ట్ షో పడేంత వరకు వేచిచూడాల్సిందే మరి.