Advertisement
Google Ads BL

నో మోర్ డిస్కషన్స్.. పవన్ అంటే నాకు ప్రాణం!


పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటే పడిచచ్చే వీరాభిమానులు ఉన్నారన్న విషయం తెలిసిందే. అంతేకాదు సినిమాల్లో నటించే నటీనటులు కూడా ఆయనకంటే ఇష్టపడతారు. అలాంటి వారిలో పవన్‌కు నమ్మిన భక్తుడిగా.. పవనే తన దేవుడిగా.. పవన్‌ అంటే పిచ్చిగా ప్రేమించే వ్యక్తి.. నటుడు కమ్ సినీ నిర్మాత బండ్ల గణేష్ అన్న విషయం తెలిసిందే.

Advertisement
CJ Advs

ఇదిలా ఉంటే.. కాంగ్రెస్‌ పార్టీకి గుడ్ బై చెప్పేసిన తర్వాత సోషల్ మీడియాలో ఈయన యమా యాక్టివ్ అయ్యాడు. ఇదివరకే ఏపీలో పాలన బాగలేదని.. సీఎంగా వైఎస్ జగన్ చేసిందేమీ లేదని.. అధికార పార్టీకి ప్రతిపక్షనేత చంద్రబాబు సమయం ఇవ్వాలని ఇలా పెద్ద పెద్ద మాటలే మాట్లాడాడు. అయితే తాజాగా.. జనసేనాధిపతి పవన్ గురించి ఓ ఆసక్తికర ట్వీట్ చేశాడు.

‘జన్మనిచ్చిన తల్లిదండ్రులు.. పవన్ కల్యాణ్ అంటే నాకు ఎప్పుడూ ప్రాణమే. తల్లిదండ్రులు, పవన్ కల్యాణ్ విషయంలో నేను ప్రతి రోజు శీల పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఈ ముగ్గురి విషయంలో వాదనలు అనవసరమని.. నో మోర్ డిస్కషన్స్’ అని చెప్పుకొచ్చాడు. పవన్ గురించి ఇలా ట్వీట్ చేయడం వెనుక పెద్ద కారణం ఉంది.. ‘జెండా, అజెండా లేని నాయకులు కొంత కాలం రెస్ట్ తీసుకుంటే మంచిది’ అని ఇటీవల చేసిన ఓ ట్వీట్‌లో ఉంది. అయితే ఇది పవన్‌ను ఉద్దేశించి అన్నారని అందరూ అనుకున్నారు.. పలు వెబ్‌సైట్స్ సైతం దీన్ని హైలైట్ చేశాయి. దీంతో మళ్లీ బండ్ల పై విధంగా క్లారిటీ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

No more discussions I love pawan kalyan said bandla ganesh:

No more discussions I love pawan kalyan said bandla ganesh
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs