Advertisement
Google Ads BL

బన్నీవాసుని ఇష్టపడ్డా.. అందుకే పాప ఫొటో!


టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, మెగా ప్రొడ్యుసర్ బన్నీ వాసు తనకు సినిమా అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి మోసం చేశారని గత కొన్ని రోజులుగా జూనియర్ ఆర్టిస్ట్ సునీత బోయ నానా హడావుడి చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే..  ఇప్పటికే ఫిల్మ్‌ చాంబర్ ముందు గొలుసులతో కట్టేసుకోవడం.. ఆ తర్వాత ఫేస్‌బుక్ వేదికగా వీడియోలు చేయడం.. ఇందుకు బన్నీ వాసు రిప్లై ఇవ్వడం జరిగిపోయాయ్. తాజాగా మరో వీడియోతో సునీత కలకలం రేపింది. ఈ వీడియోలో ఏకంగా బన్నీవాసు అంటే ఇష్టమని.. ఇష్టపడ్డానని చెప్పడం గమనార్హం.

Advertisement
CJ Advs

సీరియస్ రెక్వెస్ట్!

ఈ వీడియో మొత్తమ్మీద ఆమె ఏం మాట్లాడుతోందో అర్థం కానిపరిస్థితి.. కాసేపు ఆరోగ్యం సర్లేదనడం.. మరికాసేపు నవ్వడం.. మరికాసేపు నవ్వుతూ మాట్లాడటం అసలేం మాట్లాడుతోందో ఆమెకు తెలియాల్సి ఉంది. ‘చిన్నప్పట్నుంచి నాకు మానసిక స్థితి సరిగా ఉండేది కాదు. నా పేరెంట్స్‌ని కూడా కొట్టేదాన్ని. బన్నీ వాసు తనకు ట్రీట్ మెంట్ ఇప్పిస్తానని చెప్పినట్లు వీడియోలో విన్నాను. బన్నీ వాసు ఫారిన్ నుండి ఇండియాకి వచ్చుంటే.. ఆయనకు సీరియస్‌గా రిక్వెస్ట్ చేస్తున్నా.. నాకు ఆరోగ్య పరిస్థితి నిజంగా బాలేదు. నేను చాలా డిప్రెషన్‌లో ఉన్నాను. ఈ సమస్య నాకు టెన్త్ చదివే వయసు నుంచే ఉంది’ అని ఆమె చెప్పింది.

అందుకే పాప ఫొటో!

నిజంగానే మిమ్మల్ని ఇష్టపడ్డాను.. ఈ మాట చెబుతుంటే నాకు నవ్వొస్తోంది. ఇలా మాట్లాడుతున్నందుకు బాధగానే ఉంది. నేను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా. నా దగ్గర డబ్బులు కూడా లేవు. మీరే సాయం చేయాలి. గత 45 రోజులుగా నా మైండ్ సరిగా లేదు. ఒత్తిడికి లోనై కంట్రోల్‌లో ఉండటం లేదు. పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి. డిప్రెషన్‌కి లోనై బన్నీ వాసు పాప కోసం కూడా పోస్ట్ పెట్టాను. నాకు సినిమాలు ఇస్తారా? లేదా అన్నది ఆయనిష్టం. కానీ నాకు ఆరోగ్యం బాగుచేసుకునేందుకు సాయం చేయండి. నేను మిమ్మల్ని ఎంత అభిమానించానో.. ఇష్టపడ్డానో.. మీకు తెలుసు. అలాంటిది మీరే పోలీసులకు పట్టించేసరికి డిస్ట్రబ్ అయ్యా. నాకు అవే గుర్తొస్తున్నాయి. నేను మామూలు మనిషిని కావాలంటే.. ట్రీట్‌మెంట్ చేయించండి. ఆ బాధ్యత గీతా ఆర్ట్స్ బన్నీకి ఉంది. ఈ వీడియో చూసి స్పందిస్తారని ఆశిస్తున్నాను’ అని ఫేస్‌బుక్ లైవ్‌లో సునీత చెప్పుకొచ్చింది. మరి ఈ వ్యవహారంపై బన్నీవాసు ఎలా రియాక్ట్ అవుతాడో..? అసలు వీరిద్దరి మధ్య అసలేం జరుగుతోందో అర్థం కాని పరిస్థితి.. ఈ వివాదానికి ఎప్పుడు ఫుల్‌స్టాప్ పడుతుందో వేచి చూడాలి మరి.

Sunitha Boya Emotional Video On Bunny Vas!:

Sunitha Boya Emotional Video On Bunny Vas!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs