Advertisement
Google Ads BL

డైరెక్టర్ తేజ కన్ను ఈసారి ఆ భామపై..!


సీత సినిమాతో సైలెంట్ మోడ్‌లోకెళ్ళిన దర్శకుడు తేజ పేరు మళ్ళీ ఫిలింసర్కిల్స్ లో వినబడుతుంది. కాజల్ అగర్వాల్ మెయిన్ లీడ్ లో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా చేసిన సీత ఘోరంగా ప్లాప్ అవడంతో దర్శకుడు తేజ సైలెంట్ అయ్యాడు. కాజల్ తోనే తేజ తదుపరి చిత్రమన్నారు. కాజల్ కూడా ఓకె చెప్పిందనే టాక్ నడిచింది. తాజాగా తేజ మరో లేడి ఒరింటెడ్ మూవీకి శ్రీకారం చుడుతున్నాడని.. అందులో హీరయిన్ గా బోల్డ్ పాప పాయల్ ని తీసుకోబోతున్నాడని అంటున్నారు. సీత సినిమాలో ఐటెంతో అదరగట్టిన పాయల్ రాజపుత్ తో తేజ తదుపరి సినిమా చేయబోతున్నాడట.

Advertisement
CJ Advs

RX 100 సినిమాతో బోల్డ్ ముద్ర వేయించుకున్న పాయల్ కి పొలోమని అవకాశాలు రాకపోయినా.. వెంకీమామలో వెంకీ సరసన ఓ అవకాశం, RDX లవ్ అనే సినిమాలో మెయిన్ లీడ్ లోను పాయల్ నటిస్తుంది. వెంకీమామలో పద్ధతిగాను, RDX లవ్ లో బోల్డ్ గాను, ట్రెడిషనల్ గెటప్స్ లోను పాయల్ కనిపిస్తుంది. మరి తాజాగా పాయల్ కి తేజ సినిమాలో ఛాన్స్ అంటే.. ఆమెకి అదృష్టం కలిసొచ్చినట్లే. తేజ సినిమాల్లో హీరోయిన్ పాత్రలెంత బలంగా ఉంటాయో ప్రేక్షకుడికి తెలుసు. మరి పాయల్ రాజపుత్ కూడా తేజ సినిమాతో బాగా పాపులర్ అవుతుందేమో చూడాలి.

She is the Director Teja’s next Heroine:

Director Teja Eye on Payal Rajput
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs