Advertisement
Google Ads BL

‘రాయలసీమ లవ్ స్టోరీ’ ఆడియో విడుదల


దర్శకుడు జి నాగేశ్వర్ రెడ్డి చేతుల మీదుగా ‘రాయలసీమ లవ్ స్టోరీ’ ఆడియో విడుదల  

Advertisement
CJ Advs

ఏ 1ఎంటర్టైన్మెంట్స్ మూవీస్ పతాకంపై రాయల్ చిన్నా, నాగరాజు నిర్మాతలుగా రామ్ రణధీర్ దర్శకత్వం వహించిన చిత్రం ‘రాయలసీమ లవ్ స్టోరీ’. వెంకట్, హృశాలి, పావని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్ర ఆడియో వేడుక బుధవారం ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ప్రముఖ దర్శకుడు జి. నాగేశ్వర్ రెడ్డి విచ్చేసి ఈ చిత్ర ట్రైలర్ మరియు ఆడియో బిగ్ సీడీను ఆవిష్కరించారు. అనంతరం

ముఖ్య అతిథి దర్శకుడు జి. నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. కర్నూల్ లో షూట్ చేసిన ఏ సినిమా అయినా హిట్ అవుతుందనే సెంటిమెంట్ ఇండస్ట్రీలో ఉంది. అలాంటిది కర్నూల్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ  ‘రాయలసీమ లవ్ స్టోరీ’ అనే ఈ చిత్రం ఇంకెంత హిట్ అవుతుందో ఊహించోకోవచ్చు..  ట్రైలర్ లో పూరి- రవితేజ కాంబినేషన్లో వచ్చిన ఇడియట్ సినిమా యాటిట్యూడ్ కనపడుతోంది. ఆ చిత్ర బడ్జెట్ కు రేంజ్ హిట్ వస్తే.. ఈ సినిమా బడ్జెట్ కు ఈ రేంజ్ హిట్ వస్తుందని ఆశిస్తున్నా. దర్శకుడు రామ్ లో మంచి టాలెంట్, పవర్ కనపడుతున్నాయి. అందరికీ మంచి ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటున్నాను అన్నారు.

నిర్మాత చిన్నా మాట్లాడుతూ.. రాయలసీమ అనగానే బాంబులు, ఫ్యాక్షన్ అని మాత్రమే గుర్తుకువస్తాయి అందరికీ.. కానీ వాళ్ళ ప్రేమ ఎలా ఉంటుందో తెలపడానికే ఈ చిత్రాన్ని నిర్మించాము.  టీమ్ అందరూ చాలా హార్డ్ వర్క్ చేశారు. అవుట్ ఫుట్ కూడా చాలా బాగొచ్చిందని తెలిపారు.

మరో నిర్మాత నాగరాజు మాట్లాడుతూ.. సినిమా ఫీల్డ్ మాకు సంబంధం లేకపోయినా.. రాయలసీమ అనగానే ఫ్యాక్షన్ అని అందరూ అనుకుంటారు. కానీ వారు ప్రేమిస్తే ఎలా ఉంటుందో.. అభిమానిస్తే ఎలా ఉంటాయో కూడా ఈ సినిమా ద్వారా తెలియపరచాము. అనుకున్న టైంకు సినిమాను పూర్తి చేసాము. ఈ నెల 27న మా చిత్రాన్ని విడుదల చేయనున్నాము అని చెప్పారు.

మ్యూజిక్ డైరెక్టర్ సాయి ఎలేంద్ర మాట్లాడుతూ.. అడిగినవన్నీ కాదనకుండా ఇచ్చి దర్శక నిర్మాతలు ప్రోత్సహించారు. అందుకే మ్యూజిక్ ఇంతబాగా వచ్చింది. సినిమా కూడా చాలా బాగొచ్చింది. మంచి సినిమాను ఆదరిస్తారని ఆశిస్తున్నా అన్నారు.

హీరోయిన్ హృశాలి మాట్లాడుతూ.. ఈ సినిమా నాకు అమేజింగ్ ఎక్సపీరియెన్స్ ఇచ్చింది. కో స్టార్స్ అందరూ ఎంతో సపోర్ట్ చేశారు. అందరికీ మంచి పేరు వస్తుందని అనుకుంటున్నాను అన్నారు.

హీరో వెంకట్ మాట్లాడుతూ.. వలి గారు లేకపోతే ఈ సినిమా ఉండేదే కాదు. డైరెక్టర్ రామ్ నాకు స్నేహితుడు. సినిమా లైన్ అనుకున్నప్పటి నుంచి నన్నే హీరో అని ఫిక్స్ అయిపోయాడు.  ఈ సినిమా నా కెరీర్ ను ఎక్కడికో తీసుకెళ్తుందని భావిస్తున్నా. ఇక నిర్మాతల గురుంచి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కొత్త వాళ్ళతో ఇంత బడ్జెట్ పెట్టి నమ్మకంతో ఈ సినిమా చేశారు. డిఒపి, మ్యూజిక్ ఇలా అన్నీ  హైలెట్స్ మా సినిమాలో ఉంటాయి. కొత్తవారిని ప్రోత్సహిస్తారని అలానే, ఆదరిస్తారని ఆశిస్తున్నా అన్నారు.

దర్శకుడు రామ్ రణధీర్ మాట్లాడుతూ.. సినిమా మొదటి నుంచి మాకు అన్నీ విధాలా ప్రోత్సహిస్తూ వచ్చిన జి నాగేశ్వర్ రెడ్డి గారికి ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను. సినిమా విషయానికి  వస్తే.. ఒక్క లైన్ చెప్పగానే నన్ను నమ్మి పదిరోజుల్లోనే షూటింగ్ స్టార్ట్ చేయించారు నిర్మాతలు నాగరాజు గారు చిన్నా గారు. చెప్పాలంటే వారు నాకు లైఫ్ ఇచ్చారు. ఈ స్టోరీకు ఈ టైటిల్ తప్ప ఇంకేదీ సూట్ అవదు. అందుకే రాయలసీమ లవ్ స్టోరీ అని పెట్టడం జరిగింది. అందరికీ ఎంతో నచ్చింది. చాలా పవర్ ఫుల్ స్టోరీ.. ఫుల్ లవ్ ఎంటర్టైనర్.. సినిమాలో క్యాస్ట్ అండ్ క్రూ అవుట్ స్టాండింగ్ పెర్ఫామెన్స్ ఇచ్చారు.  సినిమా రిలీజ్ తరువాత ఒక గొప్ప సినిమాగా గుర్తుండి పోతుందని పూర్తి నమ్మకంగా చెప్పగలను అని అన్నారు.

వెంకట్, హృశాలి, పావని నాగినీడు, జీవా పృధ్వి, రఘు, మిర్చి మాధవి, వేణు, తాగుబోతు రమేష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: శ్రీ సాయి ఏలేందర్, డీఓపీ: రామ్ మహేందర్, ఎడిటర్: వినోద్ అద్వైత్, ఆర్ట్: రమేష్, ప్రొడక్షన్ డిజైనర్: ఎస్.వలి, నిర్మాతలు: రాయల్ చిన్నా, నాగరాజు, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: రామ్ రణధీర్.

RayalaSeema Love Story Audio Released:

RayalaSeema Love Story Audio Launch Highlights
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs