బాహుబలిలో మహేంద్ర బాహుబలి, అమరేంద్ర బాహుబలి పాత్రల్లో ప్రభాస్ నిజమైన మహరాజులా కనిపించాడు. బాహుబలి ప్రభాస్ మేకోవర్ కి అందరూ హ్యాట్సాఫ్ చెప్పారు. ఆజానుబాహుడిలా ప్రభాస్ స్క్రీన్ మీద నిండుగా కనిపించాడు. ఇక తర్వాత సాహో సినిమా కోసం ప్రభాస్ దాదాపు నెల రోజులు అమెరికా వెళ్లి మరీ ఒళ్ళు తగ్గించే ప్రయత్నాలు చేసాడు. కానీ ప్రభాస్ అంత ఎక్కువగా ఒళ్ళు తగ్గించుకోలేకపోయాడు. సాహో సినిమా మొదలైనప్పటినుండి సినిమా విడుదల వరకు మధ్యలో కాస్త సన్నగా కనిపించినా.. తర్వాత బరువు పెరిగిన ప్రభాస్ నే ఎక్కువగా చూసాం. ఇక సాహో సినిమాలో ప్రభాస్ లుక్స్ మీద బోలెడన్ని కామెంట్స్ పడ్డాయి. రొమాంటిక్ గా బావున్నప్పటికీ.. కొన్ని సీన్స్ లో ప్రభాస్ హెవీ వెయిట్ తో కాస్త ఇబ్బందిగా కనిపించాడు. సరైన మేకోవర్ తో సాహో లో ప్రభాస్ కనిపించింది తక్కువ, అందుకే సాహోలో ప్రభాస్ లుక్స్ పై సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో కామెంట్స్ పడ్డాయి.
అయితే ప్రభాస్ ఈసారి రాధాకృష్ణతో చేసే సినిమా(జాన్) కోసం బాగా బరువు తగ్గాలని డిసైడ్ అయ్యాడట, ఇప్పటికే ఒకటి రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో ప్రభాస్ ఎక్కువ శాతం ప్రేమికుడిగా రొమాంటిక్‌గా కనిపిస్తాడట. అందుకే లుక్ పై చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడనే టాక్ వినబడుతుంది. ఇప్పటికే ప్రభాస్ డైట్ ఫాలో అవడమే కాదు... జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ కష్టపడుతున్నాడని అంటున్నారు. మరి సాహో లుక్ మీదొచ్చిన కామెంట్స్ కి ప్రభాస్ ఈసారి గట్టిగా సమాధానం ఇవ్వబోతున్నాడన్నమాట.