Advertisement
Google Ads BL

గద్దలగుంట గణేష్‌ టార్గెట్ వాళ్లే..!


ఎప్పుడూ సాఫ్ట్ పాత్రలతోనే హిట్స్ కొడుతున్న వరుణ్ తేజ్ మొదటిసారిగా వాల్మీకి సినిమాలో మాస్ మసాలా పాత్ర చెయ్యబోతున్నాడు. గద్దలగుంట గణేష్‌గా వరుణ్ పాత్ర వాల్మీకిలో అదిరిపోతోంది. ఎప్పుడూ క్లాస్ లుక్ తోనే ఆకట్టుకున్న వరుణ్ తేజ్ ఈ సినిమా కోసమని పెంచిన గెడ్డం, బాడీ లాంగ్వేజ్ అన్ని వరుణ్ లుక్ ని హైలెట్ చేస్తున్నాయి. ఈ నెల 20న విడుదలకాబోతున్న వాల్మీకి సినిమా మీద మంచి క్రేజ్ ఉంది. అలాగే వరుణ్ లుక్ తోనే సరిపెట్టుకుంటున్న మెగా ఫాన్స్ ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని వెయ్యి కళ్ళతో వేచి చూస్తున్నారు.

Advertisement
CJ Advs

మరి వరుణ్ తేజ్ ఈ సినిమాలో మాస్ మసాలా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేస్తున్నప్పటికీ... ఫ్యాన్స్ హర్ట్ అవకుండా ఓ ఫ్లాష్ బ్యాగ్ ఎపిసోడ్ ని హరీష్ శంకర్ అద్భుతంగా ప్లాన్ చేసాడట. అసలు ప్రస్తుతం రేపు విడుదల కాబోతున్న నాని గ్యాంగ్ లీడర్ కన్నా ఎక్కువగా వరుణ్ వాల్మీకి మీద ప్రేక్షకుల్లో పిచ్చ ఇంట్రెస్ట్ ఉంది అంటే నమ్మాలి. ఎందుకంటే.. గద్దలగుంట గణేష్ పాత్రలో వరుణ్ బాడీ లాంగ్వేజ్, స్క్రీన్ ప్రెజెన్స్, మాస్ లుక్స్, మాస్ డైలాగ్స్ చెప్పిన విధానం అన్ని వాల్మీకి ట్రైలర్ తోనే ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిపోయాయి. మరి వాల్మీకి సినిమాతో వరుణ్ తేజ్ ఈసారి మాస్ ప్రేక్షకులను పడెయ్యడం ఖాయంగానే కనబడుతుంది.

Varun Tej Targets Mass Fans with Valmiki:

Varun Tej Valmiki Look Crates Sensation
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs