Advertisement
Google Ads BL

గ్యాంగ్ భారమంతా న్యాచురల్ స్టార్ పైనే..!


గ్యాంగ్ లీడర్ సినిమాకి ఒకే ఒక హైలెట్ పాయింట్ నాని. హీరో నాని వల్లనే ఆ సినిమా అంతో ఇంతో క్రేజ్ సంపాదించింది. అలాగే రెండు డిజాస్టర్స్‌తో ఉన్న హీరో కార్తికేయ విలన్‌గా నటించడం మరో హైలెట్. ఇక సినిమాకి నాని, కార్తికేయ తప్ప మిగతాది హైలెట్ కాకపోవడానికి కారణం 24, హలో సినిమాల తర్వాత దర్శకుడిగా విక్రమ్ కుమార్ మీద ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు లేవు. అలాగే ఈ సినిమాలో ఒక్క నాని తప్ప మిగతా మొహాలన్నీ కొత్తగా కనబడుతున్నాయి. లేడి గ్యాంగ్‌లో ఒక్క సీనియర్ నటి లక్ష్మి తప్ప మిగతా వాళ్ళ ఫేస్ లు ఎవ్వరికి కనెక్ట్ కావు. ఇక హీరోయిన్ ప్రియాంకా అరుళ్ అయితే కాస్త గ్లామర్ గా ఎట్రాక్టింగ్ కనబడుతుందా.. అంటే అదీ లేదు.

Advertisement
CJ Advs

హీరోయిన్...... ఆ లేడి గ్యాంగ్‌లో ఓ కేరెక్టర్ ఆర్టిస్ట్ మాదిరి ఉంది కానీ.. ఎక్కడా హీరోయిన్ లక్షణాలు ఆమెలో కనిపించడం లేదు. అందుకే కేవలం నాని మాత్రమే గ్యాంగ్ లీడర్ ప్రమోషన్స్ బాధ్యతని బరువుని తన భుజాల మీద మోస్తూ సోలో ప్రమోషన్స్ చేస్తున్నాడు. గత రాత్రి జరిగిన గ్యాంగ్ లీడర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చాలా చప్పగా నడవడంతో ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో క్రేజ్ తెప్పించలేకపోతున్నారు. ఇక కార్తికేయ విలన్ రోల్ చేసినా.. అతనెక్కడా హైలెట్ అవడం లేదు. కేవలం ఓ నామమాత్రపు విలన్ లా కనిపిస్తున్నాడు తప్ప.. హీరో గారు విలన్ రోల్ చేస్తే వచ్చే క్రేజ్ మాత్రం లేదు. మరి రేపు శుక్రవారం విడుదల కాబోతున్న గ్యాంగ్ లీడర్ మీద క్రేజ్ లేకపోతే.. భారీ ఓపెనింగ్ రావడం కలే. ఏదో టాక్ బావుంటే తప్ప.. సినిమాని ఎవ్వరూ కాపాడలేరు.. ఆఖరికి నాని క్రేజ్ కూడా!

Gang Leader: Heavy Burden on Nani:

Nani High Level Promotions for His Gang Leader Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs