Advertisement
Google Ads BL

కళ్యాణ్‌కి పెద్ద హిట్.. పాయల్ మరో విజయశాంతి


‘ఆర్డీఎక్స్ లవ్’తో కళ్యాణ్ పెద్ద హిట్ కొట్టబోతున్నారు.. ట్రైలర్ లాంచ్ సెన్సెషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ 

Advertisement
CJ Advs

‘హుషారు’ ఫేమ్ తేజస్ కంచర్ల హీరోగా, ఆర్.ఎక్స్ 100 భామ పాయల్ రాజ్‌పుత్ కాంబినేషన్‌లో టాలెంటెడ్ డైరెక్టర్ శంకర్ భాను దర్శకుడిగా హ్యాపీ మూవీస్ పతాకంపై సి.కళ్యాణ్ నిర్మిస్తోన్న చిత్రం ‘ఆర్డీఎక్స్ లవ్’. ఈ చిత్ర టీజర్ నాలుగు మిలియన్ వ్యూస్ పైగా రాబట్టుకొని సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. దీంతో సినిమాపై హై ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొని వున్నాయి. కాగా ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం సెప్టెంబర్ 10న హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో ఘనంగా జరిగింది. సెన్సెషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ ముఖ్య అతిధిగా విచ్చేసి ఆర్డీఎక్స్ లవ్ థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేసారు. ఈ కార్యక్రమంలో హీరో తేజస్ కంచర్ల, హీరోయిన్ పాయల్ రాజ్ పుత్, దర్శకుడు శంకర్ భాను, ప్రముఖ నిర్మాతలు మల్లిడి సత్యనారాయణ రెడ్డి, తుమ్మలపల్లి రామసత్యనారాయణ పాల్గొనగా నిర్మాత సి.కళ్యాణ్ బొకేలతో అతిధులకు స్వాగతం పలికారు. 

సెన్సెషనల్ డైరెక్టర్ వి.వి. వినాయక్ మాట్లాడుతూ.. కళ్యాణ్ గారు డబ్బులకోసం కాకుండా నిత్యం ఫ్యాషన్‌తో సినిమాలను తీస్తున్నారు. ఈ కథని నమ్మి బడ్జెట్‌కి వెనుకాడకుండా చాలా రిచ్‌గా ఆర్డీఎక్స్ లవ్ చిత్రాన్ని నిర్మించారు. నా స్నేహితుడు శంకర్ భానుకి చాన్స్ ఇచ్చిన కళ్యాణ్ గారికి నా థ్యాంక్స్. ఈ చిత్రంతో కళ్యాణ్ గారు పెద్ద హిట్ కొట్టబోతున్నారు. దర్శకుడు శంకర్ భాను నాతోపాటే అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేసాడు. చాలా తెలివైన వాడు. చాలా మంచి సినిమాలు చేసాడు. కానీ సరైన బ్రేక్ రాలేదు. ఈ సినిమాతో కమర్షియల్ డైరెక్టర్‌గా భానుకి పెద్ద బ్రేక్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తేజస్, పాయల్ పెయిర్ చాలా బాగుంది. ఈ సినిమా వాళ్ళిద్దరికీ మంచి పేరు తేవాలి. అలాగే పాయల్ రాజ్ పుత్ ఈ సినిమాతో విజయశాంతి గారిలా స్టార్ ఇమేజ్ తెచ్చుకోవాలి.. అన్నారు. 

నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ.. ఈ సినిమా టీజర్‌కి 4 మిలియన్ వ్యూస్ పైగా వచ్చాయి. నేను ఏ లక్ష్యంతో అయితే ఈ సినిమాని స్టార్ట్ చేశానో అది ఆర్డీఎక్స్ లవ్ బ్లాస్ట్ అయి నిరూపిస్తుంది. టీజర్ రిలీజ్ అయినప్పుడు చాలా మంది కామెంట్స్ చేసారు. అలాగే గొప్పగా ఉందని పొగిడిన వారు వున్నారు. ఒక యుక్త వయసులో వున్న అమ్మాయి ఎంజాయ్ చేసే టైములో అవన్నీ వదులుకొని తన గ్రామం కోసం, చుట్టుప్రక్కల గ్రామాల ఆశయ సాధనకోసం తన శీలాన్ని సైతం పణంగా పెట్టి ఏవిధంగా పోరాడిందనేది చిత్ర కథాంశం. డెఫినెట్‌గా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాస్ట్ అవుతుంది అన్న నమ్మకంవుంది. ఈ చిత్రం తర్వాత పాయల్ మరో విజయశాంతి అవుతుంది. అంత గొప్పగా ఈ చిత్రంలో నటించింది. విజయవాడ, పోలవరం, రంపచోడవరమ్‌లలో 45 డిగ్రీల టెంపరేచర్లో కూడా నటీనటులు, టెక్నీషియన్స్ అందరు ఎంతో కష్టపడి వర్క్ చేసారు. ముఖ్యంగా కెమెరామెన్ రాంప్రసాద్, ఆర్ట్ డైరెక్టర్ చిన్నా సహకారం మరువలేనిది. చిన్న బడ్జెట్‌లో కాకుండా కథని నమ్మి పెద్ద బడ్జెట్‌లోనే 75 రోజుల పాటు ఈ చిత్రాన్ని కాంప్రమైజ్ కాకుండా తీశాం. అందుకనే చాలా రిచ్‌గా విజువల్స్ వున్నాయి. ఒక కసితో గొప్ప సినిమా తియ్యాలని చేశాను. హీరో తేజస్, పాయల్ కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయ్యింది. రథన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. ఆదిత్య మీనన్ విలన్‌గా నటించాడు. నరేష్, తులసీల నటన క్లైమాక్స్‌లో కంటతడి పెట్టిస్తుంది. ప్రేక్షకులకు ఒక గొప్ప సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ఈ క్రెడిట్ భానుకే దక్కుతుంది. సెన్సార్ పూర్తయింది.. మంచి డేట్ చూసుకొని త్వరలో సినిమా రిలీజ్ చేయటానికి ప్లాన్ చేస్తున్నాం..’’ అన్నారు. 

హీరో తేజస్ కంచెర్ల మాట్లాడుతూ.. ‘‘నా మీద నమ్మకంతో ఈ చిత్రంలో నటించే ఛాన్స్ ఇచ్చిన కళ్యాణ్ గారికి నా కృతజ్ఞతలు. టీమ్ వర్క్ తో సినిమాని అందరమ్ కష్టపడి చేసాం. టీజర్‌కి రకరకాల కామెంట్లు వచ్చాయి. ట్రైలర్ చూస్తే సినిమా కంటెంట్ తెలుస్తుంది. పాయల్ బాగా కోపరేట్ చేసి ఈ సినిమాలో నటించింది. డైరెక్టర్ శంకర్ భాను చాలా అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. వినాయక్‌గారు మా ట్రైలర్ లాంచ్ చేయడం చాలా హ్యాపీగా వుంది’’ అన్నారు. 

హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ మాట్లాడుతూ.. ‘‘ఆర్ ఎక్స్ 100 చిత్రంతో ఒక్కసారిగా నా లైఫ్ మారిపోయింది. ఆర్డీఎక్స్ లవ్ చిత్రం కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. ఎడ్యుకేషన్ పరంగా ఆలోచింపచేస్తూ.. ఇన్స్పిరేషన్‌గా ఈ చిత్రం నిలుస్తుంది. వెరీ హార్ట్ టచ్చింగ్ మూవీ. ఇంత మంచి మూవీలో నటించే ఛాన్స్ ఇచ్చిన కళ్యాణ్‌గారికి, భానుగారికి నా థాంక్స్..’’ అన్నారు. 

దర్శకుడు శంకర్ భాను మాట్లాడుతూ.. ‘‘కథ విని కళ్యాణ్ గారు  ప్రోత్సహించారు. కథకి ఏంకావాలో అవన్నీ ప్రొవైడ్ చేసి సూపర్బ్ క్వాలిటీతో ఈ చిత్రాన్ని కళ్యాణ్ గారు నిర్మించారు. హ్యాపీ మూవీస్, సీకే ఎంటర్టైన్మెంట్స్‌లో ఈ సినిమా చేయడం చాలా ప్రౌడ్‌గా ఫీలవుతున్నాను. తేజస్, పాయల్‌ల మ్యాజిక్ వండర్స్ క్రియేట్ చేస్తుంది. రాంప్రసాద్ కెమెరా వర్క్, ఆర్ట్ చిన్నా సెట్ వర్క్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్‌గా నిలుస్తాయి. రథన్ వండర్ఫుల్ మ్యూజిక్ ఇచ్చాడు. ఆర్డీఎక్స్ లవ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుందని కాన్ఫిడెంట్ గా వున్నాను. ఈ బ్లాస్టింగ్ హిట్ తో కళ్యాణ్ గారి సంస్థ గొప్ప ప్రొడక్షన్ కంపెనీ అవుతుంది. ఈ మూవీ తరువాత ఈ బ్యానర్‌లో వరుస కమర్షియల్ సక్సెస్ లు మరిన్ని రావాలని కోరుకుంటున్నాను..’’ అన్నారు.

RDX Love Movie Trailer Launch Event Highlights:

Celebrities Speech at RDX Love Movie Trailer Launch
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs