Advertisement
Google Ads BL

వందో సినిమా కోసం నాటి స్టార్ నటి వెయిటింగ్!?


టాలీవుడ్ సినీ ప్రియులకు సీనియర్ నటి ‘సంఘవి’ గురించి ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. ఎందుకంటే.. తెలుగు తెరపై నిన్నటి తరం అందాల కథానాయికల జాబితాలో ఈ ముదురు భామ కూడా ఒకరు గనుక. అప్పట్లో ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ సినిమాల్లో నటించి మంచి క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ఇప్పుడు కొత్త కొత్తవాళ్లు రావడంతో అవకాశాల్లేక ఇంటికే పరిమితమైంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో సంఘవి మాట్లాడుతూ.. తన రియల్ లైఫ్, సినిమా లైఫ్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది.

Advertisement
CJ Advs

ముఖ్యంగా అసలు ఈమెకు సంఘవి అనే పేరెలా వచ్చింది..? ఎవరు పెట్టారన్నదానిపై క్లారిటీ ఇచ్చుకుంది. ఈమె అసలు పేరుకావ్య.. అయితే తమిళ స్టార్ హీరో అజిత్ సరసన తొలిసారి ‘అమరావతి’ సినిమాలో నటించగా.. ఆ సినిమా నిర్మాత కూతురు పేరు సంఘవి కావడంతో ఆ పాత్రను అదే పేరుతో పరిచయం చేశారట. అప్పట్నుంచి ఇక కావ్య కంటే సంఘవిగానే ఈమె జనాల్లో ముద్రపడింది. పైగా సంఘవి అనే పేరు బాగా అచ్చి రావడంతో మార్చుకోలేదు.. కంటిన్యూ చేస్తూ వచ్చానని ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

కాగా.. ఇదే ఇంటర్వ్యూలో భాగంగా తన మనసులోని మాటను బయటపెట్టింది. ఇప్పటి వరకూ తాను 99 సినిమాలు చేశానని .. 100వ సినిమాలో మంచి పాత్ర చేయాలనే ఆశతో ఎదురు చూస్తున్నట్లు ఈమె చెప్పుకొచ్చింది. అయితే ఈ ముదురుభామకు తెలుగు డైరెక్టర్స్ ఏమైనా అవకాశాలిస్తారేమో వేచి చూడాలి మరి.

Sr Actress Sanghavi Waiting For 100 Movie:

Sr Actress Sanghavi Waiting For 100 Movie  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs